చిరుగాలి వీచేలా ఈ మేడలో
ఎక్కడా ఏ దారి లేదేంటో
సెలయేరు పారేలా ఈ తోటలో
ఎక్కడా ఏ వాలు లేదేంటో
ఇటువంటి చోటులలో
కమ్మే సెగలలో
ప్రేమనిలా పూయించాలో ఏంటో
ఇవాళే ఇవాళే అలా వాలిపోదా
కాశ్మీరులాంటి సీమలలో
ఆ రోజులాగే అలా తేలిపోదా
జీలమ్మనల్లాంటి ప్రేమలలో
మ్ అందాల లోయ చేసేటి మాయ
జతగా మరోసారి చూద్దాం ప్రియా
చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే
స్వర్గం అదంట పోదాం పదా
ఆ మంచు కనుమల్లో నేర్పించమంటే
నేర్పిస్తా ప్రేమంటే ఏంటో
ప్రపంచాన్ని మరచి కాసేపు ఊగిపోదాం
దేవకన్యలుండే ఆ గ్రామములో
ఆ జ్ఞాపకాలు పోగు చెయ్యి చాలు
లోటనేది ఉండదిక నీ మదిలో
నువ్వు అడిగితే తీసుకెళ్ళనా
ఆ చోటులోన చలి ఉంది చానా
వణుకుతూ నీవుంటే చూస్తూ అలా
ఎలా తాలనే అయ్యో లేడీ కూన
చలిమంటలై నన్ను నీ మాటలే
తాకుతుంటే చలేస్తాదా ఏంటో
నీ కౌగిలే నన్ను ఓ కంబలై కాచుకుంటే
వణుకుతానా ఏంటో
నా ముందు నువ్వుండి మాటాడుతుంటె
కదిలే కాలాన్నే ఆపేయనా
ఆ గూటి పడవల్లో నీ గుండెపై వాలి
నిదురిస్తా నేడే ఆ సీమలలో
ఏదేమి అవుతున్నా ఏ గొంతు ఏమన్నా
తేలుస్తా నిన్నే నా ప్రేమలలో
హ్మ్.. హ్మ్….
_________________________
సాంగ్ : కశ్మీరు (Kashmeeru)
గాయకులు: శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) & యాజిన్ నిజార్ (Yazin Nizar)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram )
సంగీత దర్శకుడు: మనన్ భరద్వాజ్ (Manan Bhardwaj)
రచయిత – ఎడిటర్ – దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)
నటీనటులు: రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రష్మిక మందన్న (Rashmika Mandanna)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.