Home » Karnataka Hasanamba Temple – ఏడాదికి ఒకసారి మాత్రమే తెరచే ఆలయం!

Karnataka Hasanamba Temple – ఏడాదికి ఒకసారి మాత్రమే తెరచే ఆలయం!

by Lakshmi Guradasi
0 comment

ఏడు రోజులు మాత్రమే తెరచి ఉంచే అమ్మవారి ఆలయం గురించి తెలుసా!. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హాసన్‌ అనే చిన్న పట్నంలో హాసనంబ అనే అమ్మవారి ఆలయం ఉంది. హాస అంటే చిరునవ్వు అని అర్ధం. తన భక్తుల్ని చిరునవ్వుతో పలకరిస్తుంది. ఈ ఆలయం బెంగళూరు నుంచి సుమారు 180 కిలోమీటర్లు ఉంటుంది. 

13 వ శతాబ్దం లో నిర్మించినట్టు చెబుతారు. ఈ దేవాలయం ఏడాదికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. అప్పుడే 7 రాజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. తరువాత దేవాలయాన్ని మూసివేస్తారు. ఆ సమయం లో నెయ్యితో వెలిగించిన దీపాన్ని అమ్మవారి ముందు పెడతారు, అంతేకాకుండా కొన్ని పూలతో పాటు రెండు బస్తాల అన్నాన్ని అమ్మవారి ముందు పెట్టి గర్భ గుడి తలుపులు మూసివేస్తారు. మరల ఆలయ ద్వారాన్ని తెరిచినప్పుడు చూస్తే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, పువ్వులు వాడిపోవు, అన్నం కూడా చెక్కుచెదరకుండా వేడిగా ఉంటుంది. 

Karnataka Hasanamba Temple

దీపావళికి ఏడు రోజుల ముందు ఈ ఆలయ తలుపులు తీస్తారు. ఈ అమ్మవారు వెలసిన కొన్నాళ్లకి ఓక భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదికి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని, లేదంటే ఏడాదికి ఒకటి కంటే ఎక్కువసార్లు గుడి తలుపులు తెరిస్తే ఎప్పటికైనా అక్కడి నుంచి వెళ్లిపోతానని హెచ్చరించింది. ఆ సమయంలో అమ్మవారు నిద్ర లో ఉంటుందని చెబుతూవుంటారు. అందుకే అప్పటినుంచి ఏడాదికి ఒక సారి మాత్రమే గుడి తలుపులు తెరుస్తున్నారు. 

పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు భ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. భ్రహ్మ ప్రసన్నమయ్యాక తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వమంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లా కల్లోలం చెయ్యడం మొదలుపెడతాడు. ఆ విషయం తెలిసిన శివుడు యోగీశ్వరీ అనే శక్తీ ని సృష్టిస్తాడు. ఆ శక్తే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి అనే సప్త మంత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ సమయంలో సప్త మాంత్రికులు కాశీ వెళ్లే మార్గం లో ఈ హాసన్ కి చేరుకుంటారు. ఆలా ఏడుగురు దేవతలు ఈ హాసన్ ప్రాంతం నచ్చి హాసన్ కొండల పైనే ఉండిపోయారంట. ఆలా అప్పటి నుంచి ఈ అమ్మవారు మూడు రాళ్ల రూపం లో కనిపిస్తుంది.  

తన భక్తులను ఎవరైనా హింసిస్తే ఊరుకోదు ఒకపుడు తన భక్తురాలైన ఒక ఆమెని వాళ్ళ అత్తగారు హింసించే దంట. అందుకు అమ్మవారు కోపగించి రాయిగా మార్చేసిందంటా. ఇప్పటికి ఆ శిలా హాసనంబ గర్భాలయం లో చూడవచ్చు. అంతేకాకుండా ఆ శిలా ప్రతి ఏడాదికి ఒక ఇంచు హాసనంబ అమ్మవారి దెగ్గరికి జరుగుతువుంది. ఎప్పుడైతే ఆ శిలా అమ్మవారి దెగ్గరకి చేరుకుంటుందో అప్పుడు కలియుగం అంతం అవుతుందంట. 

Karnataka Hasanamba Temple

ఆశ్వయుజ మాసం లో పౌర్ణమి తరువాత  వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరచి బలిపాడ్యమి మర్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి పూలు ,దీపం సమర్పించి మూసివేస్తారు. ఆలయం తెరచిన రెండొవ రోజు నుంచి భక్తులు వివిధ ప్రాంతాల  నుంచి వస్తారు. గుడి ప్రారంభంలో సిద్దేశ్వర స్వామి ఆలయం మరియు 101 శివలింగాలను చూడవచ్చు. 

ఈ ఆలయంలో రెండు అరుదైన విషయాలు ఉన్నాయి ఒకటి 9 తాళాలతో రావణుడు కనిపిస్తాడు. రెండోవది సిద్దేశ్వర స్వామి లింగ రూపంలో కాకుండా మనిషి రూపం లో కనిపిస్తాడు. 

Karnataka Hasanamba Temple
Karnataka Hasanamba Temple

సందర్శించడానికి ఉత్తమ సమయం: దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం మరియు ఆమె ఆశీర్వాదం కోసం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు. అక్టోబర్ మరియు నవంబర్‌లలో, దీపావళి కారణంగా  ప్రతి సంవత్సరం సమయాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. ఈ 7 రోజులలో ఆలయ సమయాలు ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు. మరియు 3:00 p.m. వరకు 10:30 p.m. 

ఎలా చేరుకోవాలి: 

 – విమానం: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో సమీప విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం నుండి మీరు ఆలయానికి చేరుకోవడానికి టాక్సీని ఎక్కవచ్చు.

 – రైలు: హసన్ రైల్వే స్టేషన్ బెంగుళూరు, మైసూర్ మరియు మంగళూరు వంటి ప్రధాన నగరాలకు బాగా కనెక్ట్ అయి ఉంది. మీరు హుబ్లీ మరియు షిమోగా రైల్వే స్టేషన్ల ద్వారా కూడా ప్రయాణించవచ్చు. మీరు ఏ స్టేషన్‌కు చేరుకుంటారు అనేదానిపై ఆధారపడి ఉంటాయి ఆలయానికి చేరుకోవాడిని  టాక్సీలు మరియు క్యాబ్‌లు.

 – రహదారి: ఈ నగరం జాతీయ రహదారి 766లో ఉంది, ఇక్కడికి దక్షిణ భారత ప్రధాన నగరాల నుండి బస్సు లేదా కారు ద్వారా చేరుకోవచ్చు.

హోటల్స్

-మయూర ఇంటర్నేషనల్ హోటల్ : ఈ హోటల్ హసనాంబ ఆలయానికి 0.3 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు A/C మరియు నాన్-A/C ఛాయస్ లతో విశాలమైన గదులు ఉన్నాయి.

– అష్హోక్ హసన్: ఈ హోటల్ హసనాంబ ఆలయానికి 0.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి సేవలు మరియు మంచి ఆహారాన్ని అందిస్తారు. ప్రకృతితో గడపాలనుకునే వారికి ఇది మంచి హోటల్. 

– సువర్ణ రీజెన్సీ: ఈ హోటల్ హసనాంబ ఆలయానికి 0.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచి  సౌకర్యాలను అందిస్తారు. ఆలయానికి దగ్గరగా ఉండాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

హాసనంబ ఆలయం లొకేషన్ (exact location):

మరిన్ని ఇటువంటి మిస్టీరియస్ అలయాల గురించి తెలుసుకోవాలంటే తెలుగు రీడర్స్ భక్తి ను చుడండి.

You may also like

Leave a Comment