పాట: కనులు నావైనా
లిరిసిస్ట్: భాస్కరభట్ల రవి కుమార్
గాయకులు: జుబిన్ నౌటియల్, మోహన భోగరాజు
చిత్రం: ఇజం (2016)
తారాగణం: అదితి ఆర్య, కళ్యాణ్ రామ్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
జిందగీ కె లియే జాన్ జరూరి హై
జీనే కె లియే అర్మాన్ జరూరి హై
ఇస్ జానో అర్మాన్ కె లియే తేరే ముస్కాన్ జరూరి హై
ఔర్ ముస్కాన్ కె లియే మేరీ జాన్ దేదుంగ
యా కిసి కి జాన్ లుంగా
కనులు నావైన కలలు నీవేలే
పెదవి నాదైన పిలుపు నీదేలే
ఈ గుండె నాదైన ఉండేది నువ్వేలే
ఈ ప్రాణం నాదైన ఊపిరి నువ్వేలే
మహా బాగుంది మాయలాగా ఉంది
మరో లోకంలో మనసు దూకింది
కనులు నావైన కలలు నీవేలే
పెదవి నాదైన పిలుపు నీదేలే
నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా
నన్నేమో నీకిచ్చేసాగా
గుండెతో గుండెనే ఇలా
గుచ్చేసా దండలా
జనోనా జనోసనం
నచ్చింది ప్రేమ తనం
నీ నవ్వు నా మరణం
నీ చూపే నా జననం
మహా బాగుంది మాయలాగా ఉంది
మరో లోకంలో మనసు దూకింది
నాదంటూ నీదంటూ
ఏముంది కొత్తగా
ఇద్దరినీ కరిగించేసాక
జన్మతో జన్మకి ఇలా
ముడి వేద్దాం గట్టిగా
జనోనా జనోసనం
ప్రేమంటే పిచ్చితనం
నువ్వేలే నా చలనం
నీపేరే నా మననం
మహా బాగుంది మాయలాగా ఉంది
మరో లోకంలో మనసు దూకింది
కనులు నావైన కలలు నీవేలే
పెదవి నాదైన పిలుపు నీదేలే
మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.