కన్నుల్తో ఏమన్నా నువ్వు
అవునంటూ వింటున్నా నేను
ఇంకేమి కోరేది నిన్ను
నువ్వుంటే చాలంటున్నాను
ఏ భారమైన ఏ గాయమైన
నా వెంట తోడుంది నువ్వే కదా
ఎవరైన రాని వదిలెల్లి పోని
ఏనాడు నను వీడి వెళిపోవుగా
నీ పలుకొక రాగం
నీ చెలిమొక మేఘం
నను తడిపిన అందాల చిరుజల్లు నువ్వు
నీ పలుకొక రాగం
నీ చెలిమొక మేఘం
నను తడిపిన అందాల చిరుజల్లు నువ్వు
(అందాల చిరుజల్లు నువ్వు
అందాల చిరుజల్లు నువ్వు)
నువ్వు రానిదే అడుగెటు సాగదు
నువ్వు లేనిదే మనసు మాట్లాడదు
ఇన్నాళ్ల గతమంతా వివరించమందే
నీ పేరు లేకుండా క్షణమైనా ఉందా
నీతోనే మెదిలా… నీలోనే కరిగా
నిజమైన కలగా నడిపించు వెలుగా
ఏ రంగులు లేని నా జీవితాన్ని
హరివిల్లు చేసింది నువ్వే కదా..
(అందాల చిరుజల్లు నువ్వు)
కన్నుల్తో ఏమన్నా నువ్వు
అవునంటూ వింటున్నా నేను
ఇంకేమి కోరేది నిన్ను
నువ్వుంటే చాలంటున్నాను
భారం గాయం తోడు నువ్వే కదా
ఎవరైన రాని… వదిలెల్లి పోని
ఏనాడు నను వీడి వెళిపోవుగా
నీ పలుకొక (నీ పలుకొక)
నీ చెలిమొక (నీ చెలిమొక)
నను తడిపిన (నను తడిపిన)
చిరుజల్లు నువ్వు
నీ పలుకొక రాగం
నీ చెలిమొక మేఘం
నను తడిపిన
(నను తడిపిన నను తడిపిన)
(అందాల చిరుజల్లు నువ్వు)
(అందాల చిరుజల్లు నువ్వు)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.