నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఉండే కామాక్షి అమ్మవారి ఆలయం అంటే – మామూలు గుడి కాదు! శక్తి స్వరూపమైన కామాక్షి అమ్మవారు ఉన్న ఆలయం. ఈ ఆలయం లో శ్రీ మల్లికార్జున స్వామి మరియు కామాక్షి తాయారు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ అమ్మవారు అక్షరాలా భక్తుల ఆత్మపరిష్కారానికి దారి చూపేలా ఉంటారు. ఎవరైనా గట్టిగా మొక్కుకుంటే ఆ తల్లి ఆశీస్సులు వెంటే ఉంటాయి!. కనుకే దూర దూరాలనుంచి భక్తులు వచ్చి మొక్కే పవిత్ర స్థలమయింది.
ఈ ప్రాంతాన్ని తొలుత “రజతగిరి” లేదా “యజ్ఞవాటిక” అని పిలిచేవారు. తర్వాత “జొన్నవాడ”గా మారింది.
ఇప్పటికీ ఊర్లలో ఎవరైనా దేవుడి దిశగా అడుగు పెడితే, “ఓక్కసారి అమ్మ దిక్కు చూసుక్కొ” అంటారు. అలా చెప్పే ఆలయాల్లో మొదట జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయమే. ఎప్పటి నుంచో ఈ ఆలయమే మానవాళికి ఆశాదీపం. అమ్మవారి దర్శనానికి వెళ్ళితే మనసు పరవశించిపోతుంది, ఆత్మకెంతో తృప్తి కలుగుతుంది.

ఆలయ స్థాపన వెనకున్న కథ:
పురాణాల ప్రకారం, కశ్యప ప్రజాపతి భూమిపై పవిత్ర యజ్ఞం చేయాలని సంకల్పించారు. దానికి అనుకూలమైన స్థలాన్ని వెతుకుతూ, పెన్నా నది ఉత్తర తీరాన ఉన్న రాజతగిరి (ఇప్పటి జొన్నవాడ) వద్ద మూడు యజ్ఞగుండాలను (దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, ఆరసపత్యాగ్ని) ఏర్పాటు చేసి యజ్ఞం నిర్వహించారు. కశ్యప మహర్షి భక్తిని చూసి యజ్ఞంలో నుండి Mallikarjuna (శివుడు) లింగాకారంలో ప్రత్యక్షమయ్యాడు. స్కంద పురాణంలో ఈ యజ్ఞ స్థలాన్ని “జన్నాద”గా పేర్కొన్నారు, ఇది తరువాత “జొన్నవాడ”గా మారింది.
శివుని కోసం పార్వతి దేవి ఇక్కడికి వచ్చి, ఆయన కోరిక మేరకు ఈ ప్రాంతంలోనే ఉండాలని నిర్ణయించుకొని, విగ్రహరూపంలో పెన్నా నదిలో నివసించసాగింది. తరువాత, మత్స్యకారులు అమ్మవారి విగ్రహాన్ని పెన్నా నదిలో కనుగొని నది ఒడ్డున ప్రతిష్ఠించారు.
4వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు హిమాలయాలకు వెళ్ళే మార్గంలో ఈ విగ్రహాన్ని దర్శించి, శివునితో పాటు అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠించారు. అదేవిధంగా, ఆలయంలో శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ ఆలయం శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది
ఆలయ చరిత్ర:
అప్పట్లో విక్రమసింహ వర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి శివుడంటే చాలా భక్తి. ఆ రాజుకి ఓ రోజు కలలో అమ్మవారు ప్రత్యక్షమై, “నాకు ఇక్కడ ఆలయం కట్టించు!” అనిందట. వెంటనే లేచి, ఆలయం కట్టేశాడట. ఆ క్షేత్ర పవిత్రత మరింత పెరిగింది ఎందుకంటే, ఆదిశంకరులు స్వయంగా వచ్చి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. ఆ శ్రీచక్రం – శక్తి స్వరూపాన్ని తెలియజెప్పే మహా పవర్‌ఫుల్ జ్ఞానచిహ్నం అని చెప్తారు.
1150 సం.లో రాజు మనుమసిద్ధి ఈ ఆలయాన్ని నిర్మించి, కామాక్షి అమ్మవారి మరియు మల్లికార్జున స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ప్రాంతాన్ని మొదట రాజతగిరి లేదా యజ్ఞవాటికగా పిలిచేవారు, తర్వాత జొన్నవాడగా మారింది. పలు రాజవంశాల పాలనలో ఆలయం పునర్నిర్మాణాలు, విస్తరణలు పొందింది. ద్రావిడ శైలిలో నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ.
జొన్నవాడ కామాక్షి అమ్మవారి గుడి విశిష్టత:
ఇక్కడి శ్రీచక్ర దర్శనం అంటే – ఓ పవిత్ర అనుభూతి అంట. అదొక్కటే కాదు – ప్రతి రోజు చేసే పూజలు, కళ్యాణోత్సవాలు అన్నీ చూస్తే గుండెనిండ భక్తి వచ్చేస్తది! “తల్లి కళ్యాణం చూస్తే జీవితంలో శుభం కలుగుతుంది” అనే నమ్మకం ఉంది భక్తుల్లో.
అక్కడివాళ్లకి అమ్మవారి ఆలయం అంటే అన్నిటికంటే ముఖ్యమైన స్థలం. గడచిన పూట అన్నం లేకపోయినా, అమ్మ గుడికి వెళ్లి మంటపంలో కూర్చుంటారు. మొక్కుబడిగా నూనె దీపాలు వెలిగిస్తారు. ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా – మొదట అమ్మవారి దెగ్గర తలవంచడం తప్పనిసరి. అంత ప్రభావం ఉన్న ఆలయం ఇది.
ఈ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే కొడిముద్ద తిని అక్కడే రాత్రి నిద్రిస్తే సంతానం కలుగుతుందని భక్తులలో బలమైన నమ్మకం ఉంది. ఇక్కడ నిద్రిస్తే ఇంట్లో మహాలక్ష్మి లాంటి అమ్మాయి చుట్టూ తిరుగుతుందని, అందుకే దేశవ్యాప్తంగా సంతానం కోరికతో భక్తులు ఇక్కడకు వస్తారు.
శ్రీచక్రం అమ్మ శక్తికి చిహ్నం:
ఇక్కడ ఉన్న శ్రీచక్రం అంటే మాటల్లో చెప్పలేం. అదే అమ్మ శక్తి రూపం అంటారు. అదిశంకరులు స్వయంగా దాన్ని ప్రతిష్ఠించారట – ఆ రోజు నుంచీ ఇక్కడి వాతావరణం, ఎనర్జీ అన్నీ మారిపోయాయ్. భక్తులు ఈ చక్రాన్ని చూసి ధ్యానిస్తే – మనసుకి శాంతి, జీవితంలో శ్రేయస్సు రావడం ఖాయం అంట.
అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం అనేది మాటలు కాదు, అది సాక్షాత్తు శక్తి ప్రదాన చిహ్నం. దాన్ని చుట్టూ ఓ సారి ప్రదక్షిణం చేస్తేనే గుండె దైర్యంగా మారిపోతుంది. ఎవరైనా సరే కొంచెం నమ్మకం పెట్టుకొని మొక్కుకుంటే – అమ్మ ఆపదలో ఒంటరిగా ఉండనివ్వదు.
శక్తి స్వరూపమైన అమ్మవారు:
స్థలపురాణం ప్రకారం, మొదట కామాక్షి అమ్మవారు ఉగ్రరూపంలో ఉండి గ్రామంలోని పశువులను తినేవారని, ఆ తర్వాత శాంత స్వరూపాన్ని స్వీకరించారని చెబుతారు. కామాక్షి అమ్మవారు అంటే – మమత, రక్షణ, జ్ఞానం ఇవన్నీ కలిపిన శక్తి స్వరూపం. ఈ అమ్మవారి దరికి వెళ్లి మొక్కితే – శాంతి, సంపద, ముక్తి వస్తాయనే నమ్మకం. అలాంటి పవిత్రమైన స్థలం – భక్తులు అందరు ఒకసారి వెళ్లి చూసేయాలి! ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతది.
ఇక్కడ కొన్ని రోజులు గడిపితే, ఓ సింపుల్ మనిషి కూడా దైవానికి దగ్గరవుతాడు ! కామాక్షి తల్లిని, శ్రీచక్రాన్ని కళ్లారా చూసి భక్తితో మొక్కితే – జన్మ మరణాల చక్రం నుండి విముక్తి దొరుకుతుందని నమ్మకం. కొందరైతే ఇక్కడే భక్తి మార్గం మొదలుపెట్టి జీవితాన్ని మారుస్తారట!.
గుడి నిర్మాణం కళా తల్లి రూపం:
ఇక్కడ గుడి ఆర్కిటెక్చర్ చూస్తే – నోరు వెళ్ళబెట్టేలా!, గోడల మీద శిల్పాలు చూస్తే మన పురాణం కథలు అన్నీ అక్కడే కనిపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం – ద్రవిడ శైలిలో బంగారు చెక్కులా ఉంది. అలాంటి కళను మన పూర్వీకులు ఎలా కట్టారో చూడాలి. పూల బోకెల్లా చెక్కిన రూపాలు చూడ్డానికి కన్నుల పండుగ. ఇదే కారణం – ఈ గుడిలో అడుగు పెట్టగానే ఓ భిన్నమైన శాంతి దిగుతుంది. ప్రధాన గర్భగృహంలో కామాక్షి అమ్మవారి విగ్రహాన్ని విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు. అమ్మవారు విగ్రహాన్ని కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిచ్చేలా ఉంచారు – మనల్ని కాపాడే తల్లి అనిపించేసేలా!
పండుగలు:
ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు అంటే చాలు – ఆలయం మొత్తం కాంతులతో వెలుగులో ముంచెస్తారు. పూలతో అలంకరణలు, జానపద డోల్లు, ఊరేగింపులు అన్నీ చూస్తే… మన మనసులోనే దైవానుభూతి కలిగిస్తుంది. ప్రతి ఊరినించి ఊరునించి జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
నవరాత్రులు వస్తే జొన్నవాడంతా కాంతుల వెలుగు. బాణాసంచా మోగించే గొడవ కన్నా గుడి లోపల ఉండే హారతుల శబ్దమే గట్టిగా ఉంటుంది. దీపావళి, సంక్రాంతి, బోనాలు – ఏ పండుగ అయినా గుడి దగ్గరే మొదలవుతుంది. పల్లకి ఊరేగింపు, తాళములు, హారతుల కేరింతల మధ్య అమ్మవారి అలంకారాలు చూస్తే కళ్లు తిప్పలేం. ఈ పండుగల్లో పాల్గొనడం అంటే మనం ఆ సంప్రదాయంలో భాగం అయ్యేసినట్టే.
- బ్రహ్మోత్సవం: ప్రతి సంవత్సరం 10 రోజులపాటు జరుపుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాల్లో వివిధ దేవతలను వాహనాలపై ఊరేగిస్తారు.
- నవరాత్రి ఉత్సవాలు: తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
- కళ్యాణోత్సవం: అమ్మవారి దివ్య వివాహాన్ని ప్రతిరోజూ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ దర్శనం – ఎలా వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి?
నెల్లూరు రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెల్లూరు నుండి బస్సులు, టాక్సీలు సులభంగా లభిస్తాయి. తిరుపతి, చెన్నై విమానాశ్రయాల నుంచి కూడా రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
జొన్నవాడ అనేది నెల్లూరు దగ్గరలో ఉంటది. నెల్లూరుకి రైలు గానీ, బస్సు గానీ ఎక్కి ఎలాగైనా వెళ్లొచ్చు. అక్కడినుంచి ఆటో కానీ టాక్సీ కానీ చూసుకుని ఎక్కిస్తే ఆలయానికి చేరుకుంటారు. ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉంటది. వెళ్లేటప్పుడు సాధారణమైన డ్రెస్ వేసుకుని ఆలయ నియమాలు గౌరవిస్తే మంచిది. ఫెస్టివల్ టైం లో అయితే – ఓ పండుగ వాతావరణం ఉండి, జనం గుంపులు గుంపులుగా వస్తారు.
డిజిటల్ యుగంలో ఆలయానికి వెబ్‌సైట్, సోషల్ మీడియా ద్వారా యువత, విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఆన్‌లైన్ దర్శనం, వర్చువల్ టూర్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఏప్పుడోచ్చినా దర్శనం ఆలయ సమయాలు:
జొన్నవాడ కామాక్షమ్మ గుడికి ఏ టైమ్‌కి వెళ్లిన దర్శనం దొరుకుతుంది. ఉదయం పూటే తలుపులు తెరిచేస్తారు, రాత్రి వరకూ అమ్మవారి దర్శనం ఆగదు. ఉదయాన్నే వచ్చేవాళ్లకి కూర్చుని శాంతంగా పూజ చూసే ఛాన్స్ ఉంటుంది. మధ్యాహ్నం ఆలయ లోపలే కాసేపు ఊపిరి పీల్చుకుంటే – ఆత్మకు హాయిగా అనిపిస్తుంది. అమ్మవారి తీర్థం తీసుకుని గుడి బయట కూర్చుంటే, జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుంది.
ముఖ్య సమయాలు ఆలయం ఉదయం 5:00 AM నుండి 12:00 PM, సాయంత్రం 4:00 PM నుండి 8:00 PM వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ధరలు 20 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటాయి.
పూజలు భక్తి పరవశం!:
కళ్యాణోత్సవం అంటే అమ్మవారికి పెళ్లి అన్నమాట, ఆలయంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. లక్షార్చన, శ్రీ చక్ర పూజ వంటి వివిధ పూజలు మరియు ఆచారాలు జరుగుతాయి. లక్షార్చనలు అంటే వేలాది పేర్లు అమ్మకి అర్పించినట్టు. అటువంటి పూజలలో పాల్గొంటే – పాపాలు పోయి, మనసు నిగర్విగా మారిపోతుంది.
వసతి :
ఊరికి దగ్గరగా ఉన్న హోటళ్ళు, చిలకలపల్లి దారిలో ఉన్న గెస్ట్ హౌజ్‌లు, గుడి దగ్గరే ఉండే ధర్మశాలలు అన్నీ భక్తుల కోసం రెడీగా ఉంటాయి. ఏ బడ్జెట్ అయినా సరిపోతుంది. రోజు పూట ప్రసాదాలు గుడి వద్దే దొరుకుతాయి. ఒకసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్తే, ఇంట్లోవాళ్ళతో పాటు జొన్నవాడ లోని మరెన్నో పవిత్ర ప్రదేశాలు చూసేయొచ్చు.
సమీప ఆకర్షణలు:
కామాక్షమ్మ గుడికి రావడమే కాదు, పెన్నానది దగ్గర గట్టెక్కి స్నానం చేస్తే – అదే అసలైన పవిత్రత అంటారు. అదికూడా దగ్గరలోనే ఉంటుంది. పక్కనే నరసింహస్వామి ఆలయమూ ఉంది – అక్కడికి కూడా ఓసారి వెళ్లి రావచ్చు. ఒట్టి అమ్మగారి గుడి మాత్రమే కాదు, మొత్తం ప్రాంగణం భక్తితో నిండి ఉంటుంది.
ఓసారి వెళ్లి రండి:
ఇక చివరగా చెప్పాల్సింది ఒక్కటే – మీరు మానసికంగా ఒత్తిడిలో ఉన్నా, జీవితంలో ఏదైనా భాదలు ఎదుర్కున్నా ఈ ఆలయానికి వెళ్ళండి. జొన్నవాడలో అమ్మవారి ఆలయానికీ వెళ్లడం ఓ పవిత్ర యాత్రలాంటిది. మీరు వెళ్లినప్పుడు నెయ్యిదీపాలు వెలింగింది, పూలు, కొబ్బరికాయలతో అమ్మకి అర్చన పూజ చేయించండి. అమ్మ నీ కోరికలు తీర్చకుండా ఉండదు. మనిషికి అతి పెద్ద శక్తి – నమ్మకం, అదే నమ్మకం అమ్మమీద పెట్టండి.
ఈ గుడికి వెళ్తే భౌతిక ప్రపంచం మరిచిపోయినట్టు అనిపిస్తుంది. అంత గొప్ప శక్తి ఉంటుంది అమ్మవారి సన్నిధిలో. ఇక్కడ పూజలు చేస్తే, మనసు ఒక్క చోట నిలుస్తుంది. ఏమవ్వబోతున్నామో మనకు తెలియకపోయినా – అమ్మవారి ఆశీస్సులు మనను ముందుకు నడిపిస్తాయ్. ఇక్కడికి వచ్చే ప్రతిఒక్కరికి ఆ అనుభూతి తప్పకుండా కలుగుతుంది.
మరిన్నిఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.