కోరిన కోర్కెలు తీర్చే గో – గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం
Kalpavruksha Narasimha Swamy: భద్రాచలం అనగానే మనసుకు ముందుగా శ్రీ రామచంద్రుల వారి ఆలయం గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఆలయానికి సుమారు 100 అడుగుల దూరంలోనే ఒక అరుదైన, ప్రత్యేకమైన సాలగ్రామ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఇతర నరసింహ స్వామి ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ స్వామి సాలగ్రామ రూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం లాంటి శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందారు.
కల్పవృక్ష సాలగ్రామ నరసింహ స్వామి ఆలయం ప్రత్యేకత:
సాధారణంగా నరసింహ స్వామి విగ్రహాలు విభిన్న రూపాల్లో ఉంటాయి, కానీ ఈ ఆలయంలో స్వామి సాలగ్రామ రూపంలో ఉండటం చాలా అరుదైన విషయం. ఈ స్వామి భక్తుల కోరికలు నెరవేర్చే శక్తి కలిగినదిగా నమ్మకం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ కల్పవృక్ష నరసింహ స్వామి వారి గురించే ఎక్కువగా వినిపిస్తూ ఉండడం వలన, భక్తులలో విశ్వాసం పెరుగుతోంది.
గోశాల మరియు ప్రదక్షిణలు:
ఆలయం లోపల మొదటగా గోశాల కనిపిస్తుంది. ఇక్కడ గోమాతలకు సేవ చేయడం, గోమాతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రత్యేకత. భక్తులు గోమాతలకు ప్రదక్షిణ చేస్తే పాపాలు హరిస్తాయని నమ్ముతారు. అలాగే, స్వామి సాలగ్రామానికి ప్రదక్షిణ చేయడం వలన భూమికి ప్రదక్షిణ చేసినట్లేనని భావిస్తారు. ఈ రెండింటికి కలిపి ఏకకాలంలో ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
మంగళవారం, అమావాస్య పూజలు:
ప్రతి మంగళవారం మరియు ప్రతి నెల అమావాస్య నాడు ఈ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి దర్శనం చేసుకొని, ముడుపులు కట్టి కోరికలు కోరతారు. ఈ ముడుపులు కట్టిన 40 రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని అనేక భక్తులు నమ్ముతున్నారు.
ప్రతి అమావాస్య కి ఇక్కడ విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. తదనంతరం మహాలక్షి హోమం, మహా సుదర్శన హోమం, నారసింహ హోమం, ఆయుష్య హోమం ఉంటాయి. ఈ హోమలు దర్శనం చేసుకుని ఆ యొక్క హోమ జలాన్ని, హోమ రక్షని తీసుకోవడానికి కొన్ని వేల మంది వస్తారు.
ముడుపు విధానం:
ముడుపు కట్టేటప్పుడు కొబ్బరికాయ, జాకెట్ పీస్ లాంటి సామాగ్రిని స్వామి వారికి అందించి, అర్చకులు సంకల్పం జపిస్తారు. ఆ తర్వాత 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధానం ద్వారా భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఉంది
750 సంవత్సరాల చరిత్ర:
ఈ సాలగ్రామ నరసింహ స్వామి విగ్రహానికి సుమారు 750 సంవత్సరాల చరిత్ర ఉంది. రంగాచార్యుల వంశానికి చెందిన 9వ తరం పూజారులు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం కల్పవృక్షం లాంటి దేవస్థానం, భక్తులకు కోరికలు నెరవేర్చే శక్తివంతమైనది.
ఉచిత అన్నప్రసాదం మరియు సేవలు:
ఆశ్రమంలో భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందించబడుతుంది. గోవుల సంరక్షణ కూడా ఈ ఆశ్రమంలో ప్రత్యేకంగా జరుగుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసి, శాంతి, సంతోషం పొందుతారు.
భక్తుల నమ్మకం:
భక్తులు ముఖ్యంగా నమ్ముతున్న విషయం ఏమిటంటే, ఎన్నో సంత్సరాల నుండి సంతానం లేకుండా భాధ పడ్డవారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ముడుపు కట్టిన తరువాత సంతానం పొందారని, అలాగే ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు పొందారని. ఇలా భక్తుల కోరికలు నెరవేరడం వలనే ఆ నోట ఈ నోట తెలుసుకొని భద్రాచలంలో ఉన్న ఈ సాలగ్రామ నరసింహ స్వామి వారి ఆలయానికి వాస్తునమ్మని భక్తులంతా చెబుతూ ఉన్నారు.
ఈ ఆలయం భక్తుల కోరికలు నెరవేర్చే ఒక అద్భుతమైన స్థలం. ముడుపులు కట్టి, స్వామి ఆశీర్వాదం పొందిన అనేక మంది భక్తులు తమ జీవితాల్లో సానుకూల మార్పులు పొందారని చెబుతున్నారు. ఇలాంటి పవిత్ర స్థలాలు మన ఆధ్యాత్మిక జీవితం కోసం ఎంతో ముఖ్యమైనవి. భద్రాచలం యాత్రలో ఈ సాలగ్రామ నరసింహ స్వామి ఆలయాన్ని తప్పకుండా సందర్శించడం మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సంపూర్ణం చేస్తుంది.
ఎలా వెళ్ళాలి?
Kalpavruksha Narasimha Salagrama Ashram భద్రాచలం Ramalayam సమీపంలో ఉంది. భద్రాచలం రాములవారి ఆలయం దగ్గర నుంచి సుమారు 100 అడుగుల దూరంలో ఈ ఆశ్రమం ఉంది. రామాలయం వైపునే గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం కనిపిస్తుంది.
ఆశ్రమ పరిసరాలు:
ఆశ్రమంలో ముందుగా గోశాల కనిపిస్తుంది, అక్కడ గోమాతలకు సేవ చేయడం, గోమాతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రత్యేకత. స్వామి సాలగ్రామ విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. భక్తులు ఇక్కడ ముడుపులు కట్టి, ప్రత్యేక పూజలు చేయించుకుని కోరికలు నెరవేరాలని ఆశిస్తారు.
మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.