కళ్ళకు కాటుక పెట్టి
కాళ్లకు పారాణి పూసి
ముద్దుగా ముస్తాబు అయ్యి
మురుసుకుంటా కూర్చున్నావమ్మా
తెలియాని ప్రేమను చూసి
తెల్లవార్లూ నిన్నే తలచి
నాలో నన్ను పిచోడ్ని చేసి
నవ్వుకుంట ఎట్లుంటావమ్మా
ఎందుకే మనస్సు లేని రాయివైనావు
పిలిచినా పలకవేందే ఏమి పాపము
జీవిత ఖైదీనే చేసి పోయినావు
తామర పువ్వులాగా రాలి పొయ్యినావు
అడిగిన నిన్ను మనసును ఇవ్వమని
కోరిననా నిన్ను దాగ్గరవ్వమని
ఊహల పలకితో ఊహలు పెంచుకుని
బ్రతికేనమ్మా నేను బాధను ఇచ్చి పోకే
రాతి బొమ్మల చలనం లేదుగా
ఎదురుగా నేనున్నా మాటే రాదుగా
ఎంతగా ప్రేమించి ఏమి లాభమే
అవుతున్నగదనే నీకే దూరమే
ఎందుకే మనస్సు లేని రాయివైనావు
పిలిచినా పలకవేందే ఏమి పాపము
జీవిత ఖైదీనే చేసి పోయినావు
తామర పువ్వులాగా రాలి పొయ్యినావు
నువ్వనుకున్నాట్టు ఆస్తులు నాకు లేవే
రంగులను మేడలను చూస్తే ప్రేమగాదే
పైసలు చూసి నేను నిన్ను ప్రేమించలేదే
మనసును చూసినాక ప్రాణం ఇచ్చినానే
కాగితాకట్టలు ప్రేమకు సరిపోవే
ఆస్తులు ఎంతున్నా మనసుకు సరిరావే
కన్నా ప్రేమ కింద నలిగేను మన ప్రేమే
కన్నీళ్లు ఆపుకుని అక్షింతలేసినానే
ఎందుకే మనస్సు లేని రాయివైనావు
పిలిచినా పలకవేందే ఏమి పాపము
జీవిత ఖైదీనే చేసి పోయినావు
తామర పువ్వులాగా రాలి పొయ్యినావు
______________________________________________________
పాట: కళ్ళకు కాటుక పెట్టి (Kallaku Kattuka petti)
సాహిత్యం: సురేష్ అరకంటి (Suresh Arakanti)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
నటీనటులు: కార్తీక్ రెడ్డి (Karthik Reddy), ప్రేమ లత చిన్ను (Prema Latha Chinnu)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.