Home » కలలో కలలోయమ్మ సాంగ్ లిరిక్స్ – ప్రణయగోదారి (pranayagodari)

కలలో కలలోయమ్మ సాంగ్ లిరిక్స్ – ప్రణయగోదారి (pranayagodari)

by Lakshmi Guradasi
0 comments

కలలో కలలోయమ్మ
కలలే కలలు
నిన్ను చూస్తే మొదలయే
నాలో కలలే కలలు

సోదలో సోదలోయమ్మ
సోడలే సోడలు
నిను తాకాక మొదలాయే
నాలో సోదాలే సోదాలు

మల్లె పువ్వంటి నవ్వు లాగేసిన
ముద్ద మందార బుగ్గ గిల్లేసిన
పల్లె పైర శెల్లో పడకేయన
పొద్దు పొడలేదాక అల్లేసేయనా

కలలో కలలోయమ్మ
కలలే కలలు
నిన్ను చూస్తే మొదలయే
నాలో కలలే కలలు

ప్రణయగోదారిలోన పరువాల పడవేసి
ప్రేమ రాహదారిలోన తెరచెప గొడుగేసి

ఇసక తిన్నెలో ఈడు దొర్లేసినట్టు
మసక రాత్రిలో నన్ను తడిమెసినట్టు
నీలి నీ చేప కళ్ళు ఈదేసినట్లు
ప్రేమ గాళాన్ని ప్రేమగా మింగేసినట్టు
నీ మత్తుల్లో మనసంతా మునకేసినట్టు
నీ ఎత్తుల గొయ్యిలో ఇరికేసినట్టు

కలలో కలలోయమ్మ
కలలే కలలు
నిన్ను చూస్తే మొదలయే
నాలో కలలే కలలు

చెలివ నీళ్లలో ఎంగిలి పెడవార చేసేసి
చలువ నీడలో కౌగిలి మనసారా ఇచ్చేసి
పాపీకొండలో పైట పారేసినట్టు
చేప పులుసల్లె మేని మెరిసేసినట్టు
నీటి నూరగల్లె నన్ను తాకేసినట్టు
సొర చేపల్లే సోకు చూపేసినట్టు
నా అడుగుల్లో అడుగేసి నడిచేసినట్టు
ఈ మడుగుల్లో మన జంట మనువడినట్టు

కలలో కలలోయమ్మ
కలలే కలలు
నిన్ను చూస్తే మొదలయే
నాలో కలలే కలలు

__________________________________________________________________________________________________________________

చిత్రం: ప్రణయగోదారి
సంగీతం: మార్కండేయ
గాయకుడు: శ్రీ కృష్ణ
సాహిత్యం: మార్కండేయ పరమాళ్ళ
దర్శకుడు: లింగయ్య పరమాళ్ళ

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చుడండి.

You may also like

Leave a Comment