తందనానా… నానా
తందనానా…. నానా
అఆఆఆ…..
అఆఆఆ…….
కలలే నిజమౌతూ కథగా మొదలయ్యే పయనం
కదిలే నిమిషాన్నే మనకై దాచింది సమయం
కంటి పాపై నిను నేను కాచుకుంటా
చీర కొంగై దాచుకుంట
నన్ను మళ్లీ మనిషల్లే మార్చేసావే
ఉన్నా ప్రాణం నీదంటూ రాసిచానే
రారా కౌగిట్లో చేరా నన్ను ఏలే వీరా
ఏ..ఏ..ఏ.. రాదే నిదురింక రావే
నా పంచధార
ఏ..ఏ..ఏ…. గుండెల్లో రాగం సాగినది
మౌనమే ప్రేమై పాడినది
నిన్నల్లో లేని నెమ్మదిది
నీ వల్లే నాలో చేరినది
నమ్మకం నీల తోడైనది
జన్మకో అర్ధం దక్కినది
ఊహకే ఊపిరి పోసినది
ఊయ్యలై నన్నే మోసినది
ఉరిమే నా కోపం
వెన్నెలైంది నీ కోసం
మధురం మన బంధం
ఇంటిపేరు ఆనందం
హాయిగున్నా నన్ను నా నుండి
మాయ చేసి నువ్వే లాగావే
కలలే నిజమౌతూ కథగా మొదలయ్యే పయనం
కదిలే నిమిషాన్నే మనకై దాచింది సమయం
వెచ్చగా నువ్వే ధరి చేరి
హత్తుకుంటే వదిలేస్తాలే
ప్రాణన్నైనా
ఈ మొరోటోడు నీకెట్ట నచ్చడంటే
చిన్న నవ్వోటి విసిరేసి దాటేస్తావే
తందనానా… నానా
తందనానా…. నానా
అఆఆఆ…..
అఆఆఆ…….
__________________________
సాంగ్ : Maari 2 [Telugu] – Maari’s Aanandhi
చిత్రం: మారి 2 (Maari 2)
గానం: అనంతు (Ananthu), M M మానసి
సాహిత్యం: సామ్రాట్ (Samrat)
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
రచన & దర్శకత్వం: బాలాజీ మోహన్
నటీనటులు: ధనుష్ (Dhanush), సాయి పల్లవి (Sai Pallavi),
నిర్మాత: ధనుష్ (Dhanush)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.