Home » కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే సాంగ్ లిరిక్స్ మన్మధ 

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే సాంగ్ లిరిక్స్ మన్మధ 

by Lakshmi Guradasi
0 comments
Kadanna Preme song Lyrics Manmadha

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా

నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగ కళ్ళలో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

పూల మనసులో గాలి ఎరుగదా నిన్ను పరిచయం చెయ్యాలా
మేఘమాలలో మెరుపు తీగవై నీవు పలికితే పణయాలా
శతకోటి కాంతలొస్తే భూమికే పులకింత
ఒక చూపు చాలదా మనసు దోచిన దొరగా
నిను తలచి వేచిన వేళ పదములా కదలదు కాలం
కన్నీటి వర్షం మధురం కాదా బాధైనా
తండ్రి నీవే అయి పాలించు తల్లి నీవే అయి లాలించు
తోడు నీడవై నను నడుపు గుండెల్లో కొలువుండే దేవి

నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగ కళ్ళలో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీవు తప్ప నాకెవరు లేరులే ప్రాణమివ్వనా నీకోసం
ఆశలాంటి నీ శ్వాస తగిలితే బ్రతికి ఉండదా నా ప్రాణం
నీ మోము చూడక నా కనులు వాలవే
విరహ వేళలో పగలు చీకటై పోయెనే
తనుమనః ప్రాణాలన్నీ నీకు నేనర్పిస్తాలే
నీకొరకు పుడితే చాలు మళ్లీ మళ్లీ
చెలియ నీ పేరు పక్కనిలా రాసినానులే నా పేరే
అది చెరిగిపోకుండ గొడుగువలె నేనుంటే వానెంతలే

నా చిట్టి ప్రేమా…

కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే
ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీవన్నా
తోడైనా ప్రేమే నీడైనా ప్రేమే
ఈడై జోడై గువ్వై గూడై నీలో నేనున్నా

నీ మనసులో పూసే పువ్వుల్లో ఘుమఘుమంతా వలపే అనుకున్నా
ఈ వయసులో వీచే గాలుల్లో సరిగమంతా పిలుపే అనుకున్నా
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో
నా పాపలాగ కళ్ళలో దాచానో
నా గుండె నీకే ఇల్లల్లే చేసానో నా ప్రేమా..

__________________________

సినిమా టైటిల్:-మన్మధ (Manmadha)
నటీనటుల బృందం:- శింబు (Simbu), జ్యోతిక (Jyothika)
సంగీతం:- యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
దర్శకుడు:-A.J మురుగన్ (A.J Murugan)
సాహిత్యం – వేటూరి (Veturi)
గాయకుడు- ఎస్పీ చరణ్ (SP Charan)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.