గుంజుకున్నా నిన్ను ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మణిహారం కుడిసేతి గడియారం
పెద్దపులినైనా అణిచే అధికారం
నీవెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే…
ఇంక అది మొదలు నా మనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
గువ్వే ముసుగేసిందే
రావాకే కునికిందే
పాలేమో పెరుగులాగ ఇందాకే పడుకుందే…
రాచ కురుపున్నోళ్ళే నిదరోయే వేళల్లోన
ఆశ కురుపొచ్చి యదే అరనిమిషం నిదరోదే…
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
ఎంగిలి పడనే లేదే అంగిలి తడవనె లేదే
ఆరేడు నాళ్ళై ఆకలి వూసే లేదే…
పేద ఎదనే దాటి ఏదీ పలకదు పెదవే
రబ్బరు గాజులకేమో సడి చేసే నోరేదే… హాయ్
హో గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
తేనె చూపే చల్లావ్ నాపై చిందేలా
తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా
కొత్త మణిహారం కుడిసేతి గడియారం
పెద్దపులినైనా అణిచే అధికారం
నీవెళ్ళినాక నీ నీడే పోనంటే పోనందే
గుండె కింద నీడొచ్చి కూర్చుందే…
ఇంక అది మొదలు నా మనసే తలవంచే ఎరగదుగా
గొడుగంచై నేడు మదే నిక్కుతోందిగా
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
గుంజుకున్నా నిన్నే ఎదలోకే
ఇంక ఎన్నాళ్ళకి ఈడేరునో ఈ బతుకే
______________________
సాంగ్ – గుంజుకున్నా (Gunzukunnaa)
చిత్రం – కడలి (Kadali)
గాయని – శక్తిశ్రీ గోపాలన్ (Shakthisree Gopalan)
సంగీతం – ఎ.ఆర్. రెహమాన్ (A.R. Rahman)
లిరిక్స్ – వనమాలి (Vanamali)
నటీనటులు – గౌతం కార్తీక్ (Gautham Karthik), అరవింద్ స్వామి (Arvind Swamy), తులసి (Thulasi), అర్జున్ (Arjun)
దర్శకుడు – మణిరత్నం (Mani Ratnam)
నిర్మాత – మణిరత్నం (Mani Ratnam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.