మా ఊరికి ఒక్క అందగాడు
పండగలాంటి పొల్లగాడు
నన్నే గెలువగ వచ్చినడు
గుండెను పొక్కిలి జేసినడు
అట్టా ఇట్టా సైగలతో
ఆగంజేస్తడు పొల్లగాడు
కట్టా మీద పోతాంటే
సెయ్యిని వట్టి లాగినడు
చెంపా మీద గుర్తొకటి
గుట్టుగ వెట్టి పోయినాడే
జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
ఓ జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంట
జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంట
ఆ వాలుతున్న పొద్దులాగా
ముద్దూగుంటడు సిన్నవాడు
పొద్దూ తిరుగుడు పువ్వులాగా
సుట్టూ తిరుగుతుంటడాడు
ఏక్కడ దాగుండి సూస్తాడో
నన్నే కాపాడుకుంటాడు
ఎప్పుడు ఎనకాలే తిరుగుతడే
మనసుకు నచ్చిన పొల్లగాడు
ఏదో ఒక్కటి జేస్తాడే
ఎన్నెల పువ్వుల నవ్వులోడు
జిల్లేలమ్మ జిట్ట
వాని మాట సెలిమె ఊట
ఓ జిల్లేలమ్మ జిట్ట
వాడు ఉంటె పండుగంట
జిల్లేలమ్మ జిట్ట
వాని మాట సెలిమె ఊట
జిల్లేలమ్మ జిట్ట
వాడు ఉంటె పండుగంట
అరె బజార్లున్న పోరగాళ్ళ
సూపులు అన్ని ఆని మీద
బాజాప్తనే జెప్పుతాన
నాకే సొంతం ఆడుల్లా
నన్ను ఏందే ఏవే అనుకుంట
ఎంటనె ఉంటే సాలు కదా
నేను ఏవయ్యో ఏందయ్యో
అంటూ పిలుసుకుంట గదా
ఎట్టాగైనా ఏలుకుంటా
నేనే వాన్ని సాదుకుంటా
జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
ఓ జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంట
జిల్లేలమ్మ జిట్ట
వాని నవ్వు పుట్ల పంట
జిల్లేలమ్మ జిట్ట
వాని సూపు సాలునంట
నా కంటీ మీద కునుకు లేక
ఎదురూ జూస్తు కూసున్న
నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే రా
లగ్గం కాయం జేసుకుంటా
సేతుల సెయ్యేసి జెప్పినావు
తిరిగొస్త పిల్లా నేను అని
బర్డరు నౌకరి పోయినావు
భద్రంగా నువ్వుంటే సాలు నాకు
బావా పత్రిక కొట్టిచ్చినా
పండుగకు నువ్వు వత్తావుగా
జిల్లేలమ్మ జిట్ట
బావ నవ్వు పుట్ల పంట
ఓ జిల్లేలమ్మ జిట్ట
బావ సూపు సాలునంట
జిల్లేలమ్మ జిట్ట
బావ నవ్వు పుట్ల పంట
జిల్లేలమ్మ జిట్ట
బావ సూపు సాలునంటా
____________________
నటి: నాగదుర్గ
లిరిక్స్ : మునుకోట ప్రసాద్
సంగీతం: కళ్యాణ్ కీస్
గాయని: శ్రీనిధి
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.