జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతను దాచకు
ఏమైనా ఓ మైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ
తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు
ఓ మైనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ
ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ
వినువీధి నీడల్లో రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు
నిలిపేనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురి సొగసుల
ఈ మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
గుడికే చెరని దీపం
పదమటి సంధ్యరాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక ధిక్కుల
దాగిన నేనెలే ఆ మైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన
ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురి సొగసుల
ఈ మైనా మైనా
In English Version:
Jili bili palukula chilipiga palikina
O maina maina
Kila kila nagavula valapulu chilikina
O maina maina
Mila mila merisina taara
Minnula vidina sitara
Mila mila merisina taara
Minnula vidina sitara
Madhuvula pedhavula mamathalu virisina
O maina o maina
Kalalanu penchaku kalathanu daachaku
Emaina o maina
Jili bili palukula chilipiga palikina
O maina maina
Kila kila nagavula valapulu chilikina
O maina maina
Adaganu le chirunaamaa o maina o maina
Chirunavve puttillu neekaina naakaina
Taalalake sigapuvvaa taarade siri muvvva
Taalalake sigapuvvaa taarade siri muvvva
Harivillu rangullo varnaale
Chilikina chilakavu ulakavu palakavu
O maina emaina
Jili bili palukula chilipiga palikina
O maina maina
Urumulalo alikidilaa vinipinche ee maina
Merupulalo nilakadaga kanipinche ee maina
Endalake allaade vennelalo trineeda
Endalake allaade vennelalo trineeda
Vinuveedhi needallo raagamlaa
Aashala mungita oohala muggulu
Nilipenaa emaina
Jili bili palukula chilipiga palikina
O maina maina
Tholakari vayusula minuguri sogasula
Ee maina maina
Mila mila merisina taara
Minnula vidina sitara
Gudike cherani deepam
Padamati sandhya raagam
Madhuvula pedhavula mamathalu virisina
O maina o maina
Chukkalu andaka dhikkula
Daagina nenelaa aa maina
Jili bili palukula chilipiga palikina
O maina maina
Tholakari vayusula minuguri sogasula
Ee maina maina
__________________
Song Credits:
సినిమా పేరు: సితార (Sithara)
పాట శీర్షిక : జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన (Jilibili Palukula Chilipiga Palakina)
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramaniam), జానకి (Janaki)
గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి (Veturi Sundarararamamurthy)
సంగీత దర్శకుడు: ఇళయరాజా (Ilaiyaraaja)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
