Home » జీనా మర్‌నా నీతోనే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

జీనా మర్‌నా నీతోనే సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
892 views
jeena marna neethone song lyrics

ఓట్టేసి చెబుతున్నానే నా పంచప్రాణానివే
నా గుండెలోవున్నవే దేవతల్లేపూజిస్తున్ననే
నిన్నిడిసిసి నేనుండనే నేనున్నా నీకోసమే
నీతోనే నేనుంటనే నిన్నుజూడంగ ఉండాలే
నీకళ్ళకేమో కాటుక అందమే నా కళ్ళకేమో నువ్వు అందమే
నిన్ను వీడలేని నీడలే ఏడడుగులేసి ఏలుకుంటనే

జీనా మర్‌నా నీతోనే జిందగి మొత్తం నీతోనే
నీకైపుట్టెను నాప్రేమే నాకే పంచవే నీ ప్రేమే
జీనా మర్‌నా నీతోనే జిందగి మొత్తం నీతోనే
నీకైపుట్టెను నాప్రేమే నాకే పంచవే నీ ప్రేమే

కళ్ళముందు నీవుంటే కదులుతుంది నా గుండె
కంటినిండా నీరూపే నిన్నే కలవవరిస్తుందే
చేతికున్న నీ గాజే నన్ను చేరదీసిందే
పెంచుకున్న నా ప్రేమే నిన్నే కోరుకుంటుందే
నింగి వాన సినుకు పెదవంచు తాకి
సిగ్గు బుగ్గపైన చిరునవ్వేపూసే
చూపులే సుట్టుముట్టేనే తేనె తూనీగలా కుట్టేనే
కోయిలమ్మతోని ముచ్చటలాడే కొమ్మారెమ్మలకు పూసినపువ్వే
పుట్టదే కునుకు పట్టదే నిన్ను చూస్తుంటే నా కంటికే
నీ చేతిలోన గీతనైతనే తలరాతలోన రాసుకుంటినే
నా రాణివే నన్ను చేరవే వేచి ఉన్నాడే ఈ రాకుమారుడే

అరే.. జీనా మర్‌నా నీతోనే జిందగి మొత్తం నీతోనే
నీకైపుట్టెను నాప్రేమే నాకే పంచవే నీ ప్రేమే
ఏయ్.. జీనా మర్‌నా నీతోనే జిందగి మొత్తం నీతోనే
నీకైపుట్టెను నాప్రేమే నాకే పంచవే నీ ప్రేమే

పాటనై వినిపిస్తినమ్మా చీకటైకనిపిస్తినమ్మా
కన్నీరై తలచినవమ్మా కావలుంట కనురెప్పలకమ్మా
చీకటింకా నీకుండదమ్మా చిన్నబోకే ఓ ముద్దుగుమ్మా
వెలుతురై వెలుగైతనమ్మా రంగులలోకాన్ని చుపిస్తానమ్మా
సందమామకన్నా అందమునీదే చల్లగాలికన్నా మనసుందే నీకే
నన్నిలా వెండి వెన్నెలై అలుముకున్నవే నా గుండెకే
సీతతోకల్లే సిన్నంగా వాలే సిన్నదానివై ఎదలోనదూరే
నిన్నిలా కౌగిలింతలా కలుపుకుంటానే కలకాలమే
నీవు కొత్తగా జత కట్టవే మూడుముళ్ళు వేసి బొట్టుపెడతనే
మూగమనసువై దోచుకుంటివే గుప్పెడంత గుండె గెలుచుకుంటివే

జీనా మర్‌నా ఏయ్..ఏయ్.. జీనా మర్‌నా
ఏయ్.. జీనా మర్‌నా నీతోనే జిందగి మొత్తం నీతోనే
నీకైపుట్టెను నాప్రేమే నాకే పంచవే నీ ప్రేమే
ఏయ్.. జీనా మర్‌నా నీతోనే జిందగి మొత్తం నీతోనే
నీకైపుట్టెను నాప్రేమే నాకే పంచవే నీ ప్రేమే

జీనా మర్‌నా నీతోనే..
జిందగి మొత్తం నీతోనే..


నాకు ఒక్క కొడుకున్నాడు సాంగ్ లిరిక్స్ – జానపద పాట

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.