జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను
హే… మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసేనె
హే… ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసేనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసేనే హా..
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను
సముద్రమంత ప్రేమ ముత్యమంత మనుసు
ఎలాగ దాగి ఉంటుంది లోపల
ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం
ఎలాగే బయట పడుతోంది ఈ వేళా హ...
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘాన్నితో ప్రయాణం
ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను
తెంచలేదు లోకం…
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు
ఎలాగా వెళ్లిపోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు
ఎలాగా దీన్ని గుండెల్లో దాచడం
ఎపుడు లేనిది ఏకాంతం
ఎక్కడలేని ఎదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమే సొంతం
జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువ్వు తాకితే నన్ను
పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను
ఎగసే కెరటానవుతాను…
పాట: జల జల జలపాతం
గాయకులూ: జస్ప్రీత్ జాస్స్, శ్రేయ ఘోషల్
సాహిత్యం: శ్రీమణి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
దర్శకుడు: బూచి బాబు
నటి నటులు: పంజా వైష్ణవ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి తదితరులు.
Eswara Parameswara Song Lyrics Uppena
Dhak Dhak Dhak Song Lyrics Uppena
Silaka Silaka Song Lyrics Uppena
Sandramlona Neerantha song Lyrics Uppena
Ranguladhukunna Song Lyrics Uppena
Nee Kannu Neeli Samudram Song Lyrics Uppena
Ninne Naa Ninne Song Lyrics Uppena
మరిన్ని తెలుగు పాటల కొరకు తెలుగు రీడర్స్ లిరిక్స్ ని సందర్శించండి.