Home » ఇష్టమే లేని పెళ్లిచేసుకుకొని సాంగ్ లిరిక్స్ – Love Failure song

ఇష్టమే లేని పెళ్లిచేసుకుకొని సాంగ్ లిరిక్స్ – Love Failure song

by Lakshmi Guradasi
0 comment

ఆ సీతామాలాగే నీ బాధలే
రామయ్య వస్తాడే నీ జాడలో
కన్నీళ్లు తుడవంగా కదిలినాడే
ఇన్నేళ్ల నీ కంచె తెంచుతాడే

ఇష్టమే లేని పెళ్లి చేసుకొని
కష్టాలు పడుతున్నావా
ఇష్టమే ఉన్న నన్ను వదులుకొని
బాధలు పడుతున్నావా
అర్ధమే చేసుకొనివారికై
అర్ధాంగివైతివే ఎందుకే
స్వార్ధమే నింపుకున్నవాడికై
అణిగి ఉంటున్నావు దేనికి
కొంత ఆలోచించివుంటే
బాగుండునేమో గాదనే

తిరిగొస్తావా ఎదురుచూస్తున్నానే
అమ్మ కోసమే చంటి బిడ్డొలే
నువ్వే రాలేవా ఎందుకంటున్నానే
మల్లి మోసమే నువ్వు చేసుకోకే

తిరిగొస్తావా ఎదురుచూస్తున్నానే
అమ్మ కోసమే చంటి బిడ్డొలే
నువ్వే రాలేవా ఎందుకంటున్నానే
మల్లి మోసమే నువ్వు చేసుకోకే

ఎంత చక్కంగా చూసుకున్నానే
ప్రేమలో నిన్ను అనాడు
అనుమానంగా చూస్తూ ఉన్నాడా
ఎందుకో నీ కట్టుకున్నాడు
నీకు పెళ్లి అయినా పిల్లలైనా
నువ్వే నా దానివే …
ఏ బాధైనా గాదైనా చెప్పే
నేను నీ వాడినే
ఓ మాట చెప్పి వీడ్కోలు చెప్పిరాయే
మూడు ముళ్ళు వేసి పెళ్లి చేసుంటా
చీకటి విడిచి వెలుగులోకి నువ్వు రాయే
నువ్వు నవ్వేటి రోజులన్నీ తెస్తా

తిరిగొస్తావా ఎదురుచూస్తున్నానే
అమ్మ కోసమే చంటి బిడ్డొలే
నువ్వే రాలేవా ఎందుకంటున్నానే
మల్లి మోసమే నువ్వు చేసుకోకే

తిరిగొస్తావా ఎదురుచూస్తున్నానే
అమ్మ కోసమే చంటి బిడ్డొలే
నువ్వే రాలేవా ఎందుకంటున్నానే
మల్లి మోసమే నువ్వు చేసుకోకే

ఎంత గోరంగా బతుకుతున్నవే
రాతెట్లా రాసిండో పైనోడు
ఎంత గారంగా పెరిగివున్నావే
నిన్నెట్లా యమునోడు
నిన్ను ఏడిపించా ఏ రోజైనా
నీ నవ్వు నేనైతనే
లోకమే అన్న ఏమైనా
నీ తోడు నేనైతనే
పాణమిచ్చి పాణామోలే చూస్తా రాయే
కుడి కాలు పెట్టి రమంటూ ఉన్న
వాడిని ఇడిచి నువ్వు నన్ను చేరుకోయే
నీకు ఆనాటి ప్రేమానంత ఇస్తా

తిరిగొస్తావా ఎదురుచూస్తున్నానే
అమ్మ కోసమే చంటి బిడ్డొలే
నువ్వే రాలేవా ఎందుకంటున్నానే
మల్లి మోసమే నువ్వు చేసుకోకే

తిరిగొస్తావా ఎదురుచూస్తున్నానే
అమ్మ కోసమే చంటి బిడ్డొలే
నువ్వే రాలేవా ఎందుకంటున్నానే
మల్లి మోసమే నువ్వు చేసుకోకే

__________________________________

పాట: ఇష్టమే లేని పెళ్లిచేసుకుకొని (Istame Leni Pellichesukoni)
సంగీతం: ఇంద్రజిత్ (Indrajitt)
సాహిత్యం & కథ : నాగరాజ్ పెర్క (Nagaraj Perka)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadhav)
నటీనటులు: శివకృష్ణ (Siva Krishna), విశ్వ ప్రియ (Vishwa Priya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment