క్రీడాకారులు పరిగెత్తుతున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు యాక్టివ్ గా ఉండటానికి చూయింగ్ గమ్ నములుతుంటారు. కొంతమంది యాటిట్యూడ్ కోసం చూయింగ్ గమ్ నోట్లో వేసుకుంటారు. 1840 నాటి కాలంలో చెట్టు నుంచి వచ్చే రెసిన్ అనే బంకలాంటి పదార్ధాన్ని ఉడికించి నమిలేవారు. 1850 లో జాన్ బేకన్ కర్టిస్ అనే వ్యక్తి అమెరికాలోని మైనే రాష్ట్రంలో మొదటిసారిగా చూయింగ్ గమ్ తయారు చేశారు. ఏదైనా పని చేస్తున్నప్పుడు చూయింగ్ గమ్ నమిలితే ఆ పని మీద పకాగ్రత పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
అయితే చూయింగ్ గమ్ తింటే లాభమా ? నష్టమా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. ఇది తినడం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. అవి ఏంటో ? ఏ విధంగా చూయింగ్ గమ్ తింటే మంచిదో తెలుసుకొని తింటే మంచిది. లేదంటే దుష్పభావాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు.
చూయింగ్ గమ్ బెనిఫిట్స్
ఆరోగ్యానికి చూయింగ్ గమ్ మంచివేనట. కొన్ని చూయింగ్ గమ్స్ లో కొద్దాముత్తంలో ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు, పదార్థాలు ఉంటాయి. అందుకే చూయింగ్ గమ్స్ నమలడం మంచిది కాదని చెబుతుంటారు. వాస్తవానికి చూయింగ్ గమ్ తినడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉండటం, జ్ఞాపకశక్తి పెరగడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు మెరుగుపడతాయాని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
చూయింగ్ గమ్ నమలడం రక్తప్రసరణ, హార్మోన్స్ విడుదల సక్రమంగా జరిగేలా నియంత్రిస్తుంది. ఇది తిన్న తర్వాత చేస్తున్న పని మీద 15 – 20 నిమిషాలు ఏకాగ్రత పెట్టవచ్చని పరిశోధనల్లో తేలింది. చుయింగ్ గమ్ ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతసేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం జరిగి అందంగా కనిపిస్తారట. బరువు తగ్గించడానికి, అప్రమత్తంగా ఉంచడానికి చూయింగ్ గమ్ సహాయపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.