ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక చిలుకల్లే
సెంగు సెంగు మంటాందే
తొంగి తొంగి సూసేటి మబ్బు సాటు మేరుపల్లే
పొంగి పొంగి పోతాందే మనసు
ఈ గాలిలో ఏమున్నదో
రాగాలే తీసింది ప్రాణం
తారరిరో తారరిరో అని పాటేదో
పాడిస్తుంది ఈ ఆనందం
ఇంతందంగా ఉంటుందా… ఈ లోకం
ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం
ఓ తెల్లవారు జాముల్లో సన్నజాజి పువ్వల్లె
మురిసి మురిసి పోతాందే మనసు
పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల గాలిపటమల్లె
ఎగిసి ఎగిసి పడతాందే మనసు
కలలే లేని కన్నులోన కథలేవో కనిపిస్తున్నాయే
అలలే లేని గుండెలోన గల గల మని పొంగాయే ఆశల అలలే
ఇంతందంగా ఉంటుందా… ఈ లోకం
ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం
ఓ తెల్లవారు జాముల్లో సన్నజాజి పువ్వల్లె
మురిసి మురిసి పోతాందే మనసు
పిల్లలొచ్చి ఎగరేసే తెల్ల గాలిపటమల్లె
ఎగిసి ఎగిసి పడతాందే మనసు
కలలే లేని కన్నులోన కథలేవో కనిపిస్తున్నాయే
అలలే లేని గుండెలోన గల గల మని పొంగాయే ఆశల అలలే
ఇంతందంగా ఉంటుందా… ఈ లోకం
ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం
ఇంద్రలోక భవనాన్నే ఇడ్చికొచ్చి ఈ గదిలో
మార్చి మళ్ళి కట్టేరో ఏమో
మాయజాలము తెలుసు మంత్రగారడి తెలుసు
రెంటికన్నా ఇది ఇంక్కోటేమో
నీలాకాశం నేలకొస్తే ఇట్టాగే ఉంటాదా ఏమో
ఈ సంతోషం దాచాలంటే హృదయాలు ఓ వంద కావాలేమో
ఇంతందంగా ఉంటుందా… ఈ లోకం
ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం
___________________
Song Credits:
పాట – ఇంతందంగా (Inthandamga)
చిత్రం – గుడ్ లక్ సఖి(Good Luck Sakhi)
నటీనటులు – కీర్తి సురేష్ (Keerthy Suresh), ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), జగపతి బాబు తదితరులు (Jagapathi Babu & others)
దర్శకుడు – నగేష్ కుకునూర్ (Nagesh Kukunoor)
గాయకుడు – DSP / దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గీత రచయిత – శ్రీమణి (Shreemani)
సంగీతం – DSP / దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.