పొద్దు పొద్దున లేసి దుప్పటిని తీసేసి
సెల్లు చేతిలో పట్టి అందులో ముఖము పెట్టి
ఇన్‌స్టా రీల్ ఆపవే ఇంట్ల పని చెయవే
ఇన్‌స్టా రీల్ ఆపవే ఇంట్ల పని చెయవే
మసక మసకన లేచి వేప పుల్లను ఏసీ
బర్ల దొడ్లకు పోయి చేతుల పెండను బట్టి
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
చాటల బియ్యం పోసి అన్నం ఎసరు పెట్టి
కూరగాయలు కోసి వంట చేసుడు మరిచి
ఇన్‌స్టా రీల్ చూడకే ఇంట్ల పని చెయ్యవే
ఇన్‌స్టా రీల్ చూడకే ఇంట్ల పని చెయ్యవే
పగ్గము ఎడ్లకు కట్టి దూడకు నీళ్లను పెట్టి
అల్పాల దావల చూసి చేనుకు బండిని కట్టి
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
అన్నము పళ్ళెములేసి చారు కూరను గలిపి
ఆకలి మురిసిపోయి సెల్లు సోపతి బట్టి
ఇన్‌స్టా రీల్ ఆపవే ముందన్నము నువ్వు తినవే
ఇన్‌స్టా రీల్ ఆపవే ముందన్నము నువ్వు తినవే
పొలము బాటను పట్టి గట్టున అడుగు పెట్టి
పార చేతుల పట్టి పారుగము నువ్ గట్టి
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
కాండిని ఎడ్లకు కట్టి దోళ్ళతోని ముడి పెట్టి
నాగలి చేతుల పట్టి సాను సాను నువ్ గలిపి
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
ఇన్‌స్టా రీల్ చెయ్యాయో ఇగ గమ్మత్తు చూడయ్యో
పొద్దంతా పని జెసి అలిసిపోయి ఇంటికొస్తే
మనువాడిన బావతోని మాట కలుపుడు మాని
ఇన్‌స్టా రీల్ ఆపవే ఇగ నన్ను చూడవే
ఇన్‌స్టా రీల్ ఆపవే ఇగ నన్ను చూడవే
లోకముకు అన్నము పెట్టె అన్నధాతవు నీవు
బాధను సాదాను మరిచి మనసు సేద తీర్చుకున్న
ఇన్‌స్టా రీల్ చూడయ్యో ఇవన్నీ ఇడిసి పెట్టయ్యో
ఇన్‌స్టా రీల్ చూడయ్యో ఇవన్నీ ఇడిసి పెట్టయ్యో
ఇన్‌స్టా రీల్ చూడయ్యో ఇవన్నీ ఇడిసి పెట్టయ్యో
_______________________
లిరిక్స్: శ్యామ్ పటేల్ (Shyam patel)
నటీనటులు : మౌనిక డింపుల్ (Mounika Dimple) & రాజేష్ జాగ్వార్ (Rajesh Jaguar)
గాయకులు: అంజలి పులింటి (Anjali pulinti) & మరిపెల్లి మనోహర్ (Maripelly Manohar)
సంగీతం: మరిపెల్లి స్టూడియో (Maripelly studio)
DJ మిక్స్: మహేష్ చొంతల్బోరి (Mahesh chonthalbori)
ఎడిటింగ్, దర్శకత్వం: ఆదర్శ్ పటేల్ (Adarsh Patel)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.