భారత వాయుసేన (Indian Air Force – IAF) దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం. ఇది 1932 అక్టోబర్ 8న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. అప్పటినుంచి ఈ రోజు వరకు, భారత వాయుసేన అనేక యుద్ధాల్లో, సహాయక కార్యకలాపాల్లో, అలాగే విమాన సాంకేతికత అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది.
IAF యొక్క నినాదం సంస్కృతంలో “తౌమమ్ పుష్పతి నిహ్” అని ఉంటుంది ధీని అర్థం “తీవ్ర వేగంతో శత్రువును వెంటాడి నాశనం చేయడం”
వాయుసేన ప్రధాన కర్తవ్యాలు
- దేశ గగనంపై రక్షణ: శత్రువుల నుంచి భారత్ గగనతలాన్ని కాపాడటం.
- యుద్ధ కాలంలో సహకారం: భూమిసేన, నౌకాసేనలకు గగన మద్దతు ఇవ్వడం.
- పరిశోధన & అభివృద్ధి: నూతనమైన విమానాల టెక్నాలజీ అభివృద్ధి.
- సహాయక కార్యకలాపాలు: ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు.
IAF లో ముఖ్యమైన యుద్ధ విమానాలు
భారత వాయుసేన (IAF) – శత్రువులకు భయాందోళన కలిగించే శక్తివంతమైన విమానాలను కలిగి ఉంది. ఈ యుద్ధవిమానాలు అత్యాధునిక టెక్నాలజీతో, వేగవంతంగా, విశ్వసనీయంగా ఉండటమే కాకుండా – మన దేశ రక్షణకు అతి కీలకమైన ఆయుధాలుగా ఉన్నాయి.
ఇక్కడ మనం భారత వాయుసేనలోని ముఖ్యమైన యుద్ధవిమానాల గురించి తెలుసుకుందాం:
1. సుఖోయ్ Su-30MKI

నిర్మాణం:
రష్యన్ డిజైన్ ఆధారంగా, భారతదేశంలోని HAL సంస్థ సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్ విమానాన్ని తయారు చేసింది. ఈ మధ్య కాలంలో వీటిని అప్డేట్ కూడా చేయడం జరిగింది.
హైదరాబాదులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ద్వారా మనదేశంలోనే కొన్ని విమానాలు తయారు అవుతున్నాయి. ఇది తెలుగు వారు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం.
ముఖ్య లక్షణాలు:
డబల్ సీటర్, డబల్ఇంజిన్
సూపర్ మానేవరబిలిటీ – గగనంలో అత్యంత వేగంగా తిరగగలగడం దీని ప్రత్యేకత
మల్టీ-రోల్ – ఏకకాలంలో గగన, భూభాగ లక్ష్యాలను దాడి చేయగలదు
రేంజ్: 3,000 కిలోమీటర్ల పైగా
అస్త్రాలు: BrahMos, Astra, R-77 వంటి హైటెక్ మిసైళ్ళు మోసుకెళ్లగలదు
IAFలో ప్రధానమైన మరియు అత్యధిక సంఖ్యలో ఉన్న యుద్ధవిమానము ఇది
ప్రత్యేకత:
Su-30MKI భారత వాయుసేనకు “స్కై బుల్లెట్” లాంటి స్టేటస్ కల్గించింది. ఈ విమానం హై ఆల్టిట్యూడ్ లో డాగ్‌ఫైట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.
2. రాఫెల్ (Rafale)

నిర్మాణం:
ఫ్రాన్స్‌లోని Dassault Aviation సహకారంతో తయారీ జరిగింది.
ముఖ్య లక్షణాలు:
- ఐదు విధాలుగా పనిచేసే మల్టీ-రోల్ ఫైటర్ అలాగే అక్కడికి అక్కడే ల్యాండ్ మరియు టేక్ ఆఫ్, ఇంకా ఏ యాంగిల్ లో అయినా వెనుకకైనా, ప్రక్కకైనా ఎటువైపైనా ప్రయాణించడం దీని ప్రత్యేకత
- రేంజ్: సుమారు 3,700 కిమీ
- అస్త్రాలు: Meteor, స్కాల్ప్ మిసైల్, Hammer బాంబ్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు మోసుకెళ్లగలదు
- ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్: శత్రు రాడార్‌ని భ్రమింపచేసే అత్యాధునిక సాంకేతికత దీని సొంతం, దీని వల్ల శత్రువులకు కనిపించకుండా ఇది దాడి చేయగలదు
ప్రత్యేకత:
భారత వాయుసేనలో 2020లో చేరిన ఈ విమానం “గేమ్ చెంజర్”గా భావించబడుతోంది. ఇది శత్రు భూభాగంలోకి వెళ్లి ఖచ్చితమైన టార్గెట్లను ధ్వంసం చేయగలదు. ప్రపంచదేశాల మేటి యుద్ధవిమానాలలో మొదటి రెండు స్థానాలలో ఈ ఫైటర్ జెట్ ఉంటుంది. ఇది దేశానికి ఒక భరోసాను కలిగిస్తుంది.
3. మిరాజ్-2000 (Mirage-2000)

నిర్మాణం:
Dassault Aviation, ఫ్రాన్స్ సహకారంతో నిర్మించారు, భారత వాయుసేనలో 1985 చేరింది
ముఖ్య లక్షణాలు:
- లైట్-వెయిట్, డెల్టా వింగ్ డిజైన్
- స్పీడ్: Mach 2.2 (సుమారు 2,350 km/h)
- అస్త్రాలు: MICA, Laser-guided bombs మోసుకెళ్లగలదు
ప్రత్యేకత:
వేగంగా టార్గెట్ చేసిన ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు. 1999 కార్గిల్ యుద్ధంలో టార్గెట్ చేసిన పర్వత ప్రాంతాల్లో సమర్థవంతంగా బాంబుల దాడులు జరిపిన ఘనత ఈ విమానానిది. అలాగే 2019 బాలాకోట్ దాడిలోను కీలక పాత్ర పోషించింది.
4. మిగ్-29 (MiG-29)

నిర్మాణం:
రష్యా సహకారంతో నిర్మించడం జరిగింది
ముఖ్య లక్షణాలు:
- ఎయిర్ సూపీరియారిటీ ఫైటర్
- స్పీడ్: Mach 2.25
- రేంజ్: 1,500 కిమీ
- అస్త్రాలు: R-27, R-73, Kh-29
ప్రత్యేకత:
అత్యున్నత స్థాయి యుద్ధ సామర్థ్యం, నౌకాదళానికి కూడా సేవలందిస్తోంది (నావిక MiG-29K)
IAF లో అత్యంత వేగవంతమైన విమానాల్లో ఇది కూడా ఒకటి. MiG-29 యుద్ధ విమానం, దాడి సందర్భాల్లో విపరీతమైన వేగంతో గగనతలంలో తిరుగుతూ శత్రువు విమానాలను ఛేదించగలదు. ఇది “స్నైపర్ ఆఫ్ ద స్కై” అని పిలవబడుతుంది.
5. తేజ్ (Tejas)

నిర్మాణం:
స్వదేశీ సంస్థ HAL (హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) అద్వర్యంలో తయారీ జరుగుతుంది
▸ ముఖ్య లక్షణాలు:
- లైట్ కాంబాట్ ఏయిర్క్రాఫ్ట్ (LCA)
- స్పీడ్: Mach 1.8
- ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ మిసైళ్ల సామర్థ్యం
- కాంపోజిట్ మటీరియల్ నిర్మాణం – తక్కువ బరువు, అధిక వేగం
ప్రత్యేకత:
తేజస్ (Tejas) భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి యుద్ధ విమానం. ఇది తక్కువ ఖర్చుతో శక్తివంతమైన సామర్థ్యంతో Make in India ప్రాజెక్టుకి జీవం పోసి ప్రతీకగా నిలిచింది.
6. జాగ్వార్ (Jaguar)

నిర్మాణం:
బ్రిటన్ – ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన విమానం.
ముఖ్య లక్షణాలు:
- గౌండ్ అటాక్ స్పెషలిస్ట్
- స్పీడ్: సుమారు Mach 1.6
- అస్త్రాలు: Conventional & Nuclear bombs, Laser-guided weapons మోసుకెళ్లగలదు
ప్రత్యేకత:
భూభాగ దాడులలో నిపుణత, నిదానంగా అయినా ఖచ్చితంగా లక్ష్యాన్ని దాటి దాడి చేయగలదు.
పాతతనంతో పాటు ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందిస్తున్న యుద్ధవిమానాల్లో ఇది ఒకటి. దాదాపు 40 ఏళ్లుగా ఇది దేశానికి సేవలు అందిస్తోంది.
7. మిగ్-21 బైసన్ (MiG-21 Bison)
విశేషాలు:
- ఇది భారత వాయుసేనలోకి చేరిన తొలి యుద్ధవిమానాలలో ఒకటి
- రష్యా తయారీ
- ఇది చాలాకాలంగా సేవలందిస్తూ వస్తుంది, ఓల్డ్ టెక్నాలజీ కారణంగా మెల్లగా దీని సేవలను పక్కకు జరిపే పనిలో ప్రభుత్వం ఉంది. అయితే ఇప్పటికే మిగ్ – 29 జెట్స్ ను వాయుసేన అందుబాటులోకి తీసుకువచ్చింది
గర్వకారణం:
- 2019లో పాకిస్తాన్‌తో ఎదురైన యుద్ధంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఈ విమానంతో ఎఫ్ – 16 శత్రు విమానాన్ని కూల్చారని అదే ప్రమాదంలో మిగ్-21 బైసన్ జెట్ కూడా ప్రమాదానికి గురవ్వడంతో వింగ్ కమాండర్ శత్రురాజ్యంలో పడిపోయి బందీగా దొరికారు.
8. హాక్ (BAE Hawk)
ఇది సాధారణ యుద్ధవిమానంలా కాకుండా సైనికులకు శిక్షణ ఇవ్వడానికి వాడే Advanced Trainer Jet.
- పైలెట్లకు యుద్ధంలో ఎలా నియంత్రించాలో నేర్పించడానికి వాడతారు.
- బ్రిటన్ తయారీ – భారత్‌లో HAL ద్వారా అసెంబుల్ అవుతుంది.
- కొన్నిసార్లు చిన్న చిన్న యుద్ధాల్లో కూడా పాల్గొంటుంది.
9. C-130J Super Hercules (హెర్క్యూలేస్)

యుద్ధ విమానం కాదు కానీ దీనికి ఉంటే ప్రత్యేక బలాల వల్ల దీని హెర్క్యూలేస్ అని పిలుస్తారు. ఇది రన్‌వే లేకపోయినా నేలమీద అయినా, ఇంకా ఇసుక మీద, నీటి మీద ఎక్కడైనా ల్యాండ్ కాగలదు.
ఉపయోగాలు:
- స్పెషల్ ఫోర్సెస్ ట్రూప్స్ దించే పని
- యుద్ధ విమానాలను సపోర్ట్ చేయడం
- ప్రమాద స్థలాల్లో సరుకులు, సిబ్బంది తీయడం
వీటితో పాటు దీనికి అమర్చిన ప్రత్యేక మిషిన్ గన్స్ కారణంగా యుద్ధంలో కూడా పాల్గొనగలదు. పెద్ద పెద్ద బాంబర్లను ఎక్కువ మోతాదులో తీసుకెళ్లగలదు, దీని సైజు భారీగా ఉంటుంది.
10. అవాక్స్ – AWACS (Airborne Warning and Control System)
ఇది యుద్ధం చేసే విమానం కాదు, యుద్ధ విమానాలకి సహకారం అందించే గగన నిఘా కేంద్రం లాంటిది.
పెద్ద రాడార్‌తో శత్రువుల మౌవ్మెంట్ని ముందే కనిపెట్టి, IAFకి సమాచారం ఇస్తుంది.
ఇది విమానాలను “డైరెక్ట్” చేయగలదు – ఎక్కడ దాడి చేయాలో వంటి వివరాలని చెప్పగలదు.
11. IL-76 & AN-32 – మిలిటరీ ట్రాన్స్పోర్ట్
ఇది యుద్ధంలో పాల్గొనదు. కానీ యుద్ధవిమానాలకు కావలసిన సామాగ్రిని, బాంబులను, సిబ్బందిని ఒక చోట నుండి ఇంకోచోటికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రాబోయే ఫైటర్స్ (Future Aircraft)
భారతదేశం ప్రస్తుతం కొన్ని భవిష్యత్ యుద్ధవిమానాల పై కూడా పని చేస్తోంది.
1. AMCA (Advanced Medium Combat Aircraft)
→ ఇది పూర్తిగా స్వదేశీ 5th Gen స్టెల్త్ ఫైటర్ గా రూపొందుతుంది.
→ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.
2. TEDBF (Twin Engine Deck Based Fighter)
→ నౌకాదళ విమానముల కోసం తయారవుతున్న స్టెల్త్-capable ఫైటర్ ఇది.
భారత వాయుసేనలోని ఈ యుద్ధవిమానాలు – దేశ రక్షణకు శక్తివంతమైన ఆయుధాలు. వీటిని నడిపే పైలెట్లు, గ్రౌండ్ సిబ్బంది అందరూ కలిసి దేశ గగన రక్షణ కవచం. వారిని గౌరవించడమే మన బాధ్యత. జై హింద్!
👉మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి.
