ఈ ఆధునిక యుగంలో దేశాల మధ్య భద్రత అనేది ఎంతో కీలకమైంది. శత్రు దేశాల నుంచి వచ్చే వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడం కోసం అత్యాధునిక వాయుసేన, క్షిపణి వ్యవస్థలు చాలా అవసరం. అటువంటి అత్యాధునిక వ్యవస్థలలో రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400 ట్రయంఫ్ (S-400 Triumph) ప్రముఖమైంది.
S-400 ట్రయంఫ్ అనేది ఒక అత్యాధునిక వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ. దీన్ని రష్యా సంస్థ అయిన అల్మాజ్-యాంటీ (Almaz-Antey) రూపొందించింది. ఇది రష్యా యొక్క S-300 వ్యవస్థకు అప్డేట్ రూపంగా అభివృద్ధి చేయబడింది.
దీని ముఖ్యమైన లక్షణాలను మనం పరిశీలించినట్లయితే
- బహుళ లక్ష్యాలపై దాడి సామర్థ్యం: అంటే 80 లక్ష్యాలను ఒకేసారి గుర్తించి వాటిపై దాడి చేయగలదు.
- విభిన్న రకాల క్షిపణులు: దీని ద్వారా 4 రకాల మిసైళ్లను ప్రయోగించవచ్చు – 40N6, 48N6, 9M96E2, 9M96E.
- రేంజ్ (Range): ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలదు.
- ఎత్తు సామర్థ్యం: 30 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాలను తాకగలదు.
- వేగం: ఇది Mach 14 వేగంతో ప్రయాణించగలదు. అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే 14 రెట్లు ఎక్కువ వరకు ప్రయాణించగలదు.
S-400 వ్యవస్థ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు వంటి ఎన్నో వైమానిక ముప్పుల నుంచి రక్షించగలదు. అందువల్ల ఇది దేశ భద్రత కోసం ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది.

భారత్ S-400 ను ఎప్పుడు కొనుగోలు చేసింది
భారతదేశానికి చుట్టుపక్కల ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో, వైమానిక భద్రతను బలంగా నిలిపేందుకు భారత ప్రభుత్వం రష్యాతో $5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం ద్వారా అయిదు ఎస్-400 యూనిట్లను కొనుగోలు చేసింది. మొదటి యూనిట్‌ను 2021లోనే భారత్ అందుకుంది.
సుదర్శన్ (S-400) వలన భారత్ కు కలిగే లాభాలు:
చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే ముప్పులను ముందుగానే గుర్తించగల సామర్థ్యం.
ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత పటిష్టం కావడం.
బాలిస్టిక్ మిసైల్, డ్రోన్ల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలగడం.
S-400 ట్రయంఫ్ (Sudarshan) అనేది ఒక దేశం యొక్క వైమానిక భద్రతను పరిపూర్ణంగా రక్షించగల అత్యాధునిక వ్యవస్థ. దీని కలుపుకోవడంతో భారత్ మరింత శక్తివంతమైన రక్షణ వ్యవస్థను ఏర్పరచుకుంది. భవిష్యత్తులో మన దేశ భద్రతకు ఇది ఒక కీలక ఆయుధంగా మారనుంది.
👉మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి.