Home » హైదరాబాద్ (Hyderabad) సాంగ్ లిరిక్స్ –  KCR (Keshava Chandra Ramavath

హైదరాబాద్ (Hyderabad) సాంగ్ లిరిక్స్ –  KCR (Keshava Chandra Ramavath

by Lakshmi Guradasi
0 comments
Hyderabad song lyrics Keshava Chandra Ramavath

సువ్వి సువ్వి సూర్యుడి కన్నా
ముందే నిద్దర లేస్తుంది
సుకుమారంగా పడతుల చేతిలో ముస్తాబవుతుంది
కభీ కభీ ఏంటో అర్ధం కాదు ఈ నగరం తీరు
కన్న తల్లినే మరిపించేంత ప్రేమ చూపిస్తుంది

ఇది షనా కొంచెమోయి
ఇంకా ఎంతో ఉన్నదోయి
ముందు కొట్టు ఇరానీ ఛాయి
జన్నత్తులో అమృతమోయి

హిందు ముస్లిం హాయి భాయి
ఇంకడంతా ఏకమొయి
క్రిస్టియన్ జైన్ సర్దార్ జి
సబ్ లోగో హొసుకుతాయి

అటు చూడు చార్మినారు
ఇటు చూడు హుస్సెన్ సాగరు
అరె ప్రపంచమంతా తన వైపే చూసే
మహ భాగ్య నగరు

అరె యది యది నాకుందిరా యది
హమారా హైదరాబాదీ
ఇది నీది నాది మనందరి నిధి
వెల్కమ్ టూ ది హైదరాబాదీ

ఇది షనా కొంచెమోయి
ఇంకా ఎంతో ఉన్నదోయి

దిల్ పసంద్ హైదరాబాద్ బిర్యానీ
దీని కోసం దిగిరాడ అకాని
మా చోటు గాడు అమ్మే పానీపూరి
ఏ ఫారెన్ దొరుకు మరి

ఆ తీగల వంతెన సొగసులు
అధునాతన నూతన సచివాలయం
మన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి చూడు
ఇక పైన ట్రెండే ఇటు

హే గోల్కొండ కోట లోన కొడితే చప్పట్లు
గ్రోప్ అంత వినిపిస్తాయి ఆ ముచ్చట్లు
హే ట్యాంక్ బాండు రోడ్డు మీద కొడితే చక్కర్లు
కనువిందు చేస్తుంటాయి ప్రేమ పావురాలు

సిటీ లో పారెన్ కలరు
అదేరా సైబర్ టవరు
చౌహానౌల్లా ప్యాలెసు
సాలార్ జంగ్ యమ ఫేమసు

మూడు దిక్కుల మూడు మతాల ఆలయాలు
బిర్లామందిర్ సెయింట్ మేరీస్ చర్చి
మక్కా మసీదులు

అరె యది యది నాకుందిరా యది
హమారా హైదరాబాదీ
ఇది నీది నాది మనందరి నిధి
వెల్కమ్ టూ ది హైదరాబాదీ

ఇది షనా కొంచెమోయి
ఇంకా ఎంతో ఉన్నదోయి

మేలైన హైదరాబాద్ ముత్యాలు
చోర్ బజార్ రవ్వల గాజులు
మన సుల్తాన్ బజార్ సంధి గొందులు
మే బోల్డ్ మెగా షాపింగ్ మాల్ లు

రాజనికపు మన ఫలక్నుమా
ఆరామ్ కి మన బరాదారి
మన హిమయత్ హుసేన్ సాగర్
దాహం తీర్చే జంట చల గిరులు

హే విశాల దేవుడు చిల్కుర్ బాలాజీ
సంస్కృతుల గని శిల్పారామం
అంబేత్కర్ స్టాచ్యు నెహ్రు జూ పార్క్
చోట హిమాలయ స్నో బాల్ పార్క్

ఉద్యమ చరితల నిలయం
ఉస్మానియా విద్య సౌధం
సకల జన సంద్ర సంబరం
ఇదో చిన్న భారత దేశం

మన్నులోన ఏ ప్రేమను కలిపి నిర్మించారో
ఈ హైదేరాబదులో అడుగెడితే ఎవ్వరైనా వదిలిపోరు

అరె యది యది నాకుందిరా యది
హమారా హైదరాబాదీ
ఇది నీది నాది మనందరి నిధి
వెల్కమ్ టూ ది హైదరాబాదీ

అరె యది యది నాకుందిరా యది
హమారా హైదరాబాదీ
ఇది నీది నాది మనందరి నిధి
వెల్కమ్ టూ ది హైదరాబాదీ

_______________________________________

పాట పేరు: హైదరాబాద్ (Hyderabad)
సినిమా పేరు: కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్) (KCR (Keshava Chandra Ramavath))
గాయకుడు: సాకేత్ కొమండూరి (Saketh Komanduri)
సాహిత్యం: చరణ్ అర్జున్ (Charan Arjun)
సంగీత దర్శకుడు: చరణ్ అర్జున్ (Charan Arjun)
తారాగణం : రాకింగ్ రాకేష్ (Rocking Rakesh), అన్నన్య కృష్ణన్ (Annanya Krishnan)
స్క్రీన్ ప్లే, రైటింగ్ ప్రొడ్యూసర్: రాకింగ్ రాకేష్ (Rocking Rakesh)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.