Home » హొయినా హొయినా – గ్యాంగ్ లీడర్

హొయినా హొయినా – గ్యాంగ్ లీడర్

by Shalini D
0 comments
hoyna hoyna song lyrics gang ieader

వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా

పలికెయ్ పాల గువ్వతో
కూలికెయ్ పూల కొమ్మతో
కసిరే వెన్నెలమ్మతో
స్నేహం చేశా
ఎగిరే పాలవెల్లితో
నడిచే గాజు బొమ్మతో
బంధం ముందు జన్మదా
ఏమో బహుశా

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా
హొయినా హొయినా హొయినా
ఇక ఏదేమైనా మీతో చిందులు
వేయనా వేయనా
హొయినా హొయినా హొయినా హొయినా
హొయినా హొయినా హొయినా
కలకాలం మీతో కాలక్షేపం
చేయనా చేయనా

నా జీవితానికి రెండో
ప్రయాణముందని
దారి వేసిన చిట్టి పాదమా
నా జాతకానికి రెండో
భాగముందని
చాటి చెప్పిన చిన్ని ప్రాణమ
గుండెలోన రెండో వైపే చూపి
సంబరాన ముంచావే నేస్తమా
నాలో నాకే రెండో రూపం చూపి
దీవించిందే నీలో పొంగే ప్రేమ

వెలిగే వేడుకవ్వనా
కలిసే కానుకవ్వనా
పెదవుల్లోయినా నింపైనా
చిరుదరహాసం
ఎవరో రాసినట్టుగా
జరిగే నాటకానికి
మెరుగులు దిద్ది వెయ్యనా
ఇక నా వేషం

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా
హొయినా హొయినా హొయినా
ఇక ఏదేమైనా మీతో చిందులు
వేయనా వేయనా
హొయినా హొయినా హొయినా హొయినా
హొయినా హొయినా హొయినా
కలకాలం మీతో కాలక్షేపం
చేయనా చేయనా

వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా
వేరేయ్ కొత్త భూమిపై ఉన్నానా
ఏదో వింత రాగమే విన్నానా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.