Home » వాట్స్ అప్ డిలీట్డ్ మెసేజెస్ నూ చూడటం ఎలా ?

వాట్స్ అప్ డిలీట్డ్ మెసేజెస్ నూ చూడటం ఎలా ?

by Nikitha Kavali
0 comment

మనం ప్రతి ఒక్కరం ప్రతి రోజు వాట్స్ అప్ ను మెసేజీలు, ఫోటోలు, వీడియోలు పంపడానికి వాడుతూ ఉంటామ. ఈ కాలం లో వాట్స్ అప్ ను వాడని వారు అంటూ ఎవరు ఉండరు. మన ప్రతిరోజు సమాచారాన్ని సులభంగా ఇతరులకు పంపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

వాట్స్ అప్ లో అనేక రకాల ఫీచర్స్ లతో వాడటానికి చాల సౌకర్యాన్ని ఇస్తుంది. వాట్స్ అప్ మెసేజ్ లను పంపడంలో అనేక రకాల ఫీచర్ లతో  గోప్యతని పాటిస్తూ ఉంటుంది. అలంటి ఒక ఫీచర్ ఏ “డిలీట్ ఫర్ ఎవరీఒన్.” ఈ ఫీచర్  ఎదుటి వాళ్ళు పంపిన మెసేజ్ ని అవతల వాళ్ళకి కూడా డిలీట్ చేసినప్పుడు అది మెసేజ్ ను డిలీట్ చేయబడినది అని చూపిస్తుంది.

దీని వల్ల అవతల వాళ్ళు ఏం పెట్టారో మనకు తెలీదు కానీ మనలో మాత్రం వాళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఉంటుంది. ఇప్పుడు డిలీట్ అయినా మెసేజ్ లను మనం చూడవచ్చు. ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూసేదం రండి. 

డిలీట్డ్ మెసేజిలను ఇలా చూసేయండి 

స్టెప్ 1: ముందు గా మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు సెట్టింగ్స్ లో నోటిఫికెషన్స్ కు వెళ్ళండి.

స్టెప్ 3: అక్కడ నోటిఫికెషన్స్ లో మోర్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

స్టెప్ 4: ఇప్పుడు అక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ను enable చేయండి.

అంతే అయిపొయింది ఇక మీరు ఏమైనా డిలీట్ అయిపోయిన మెసేజ్లను 24 గంటలల లోపు నోటిఫికేషన్ హిస్టరీ లోకి వచ్చి చూసుకోవచ్చు.

గమనిక: ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లలో లేక ఆపై వెర్షన్ లలోనే పని చేస్తుంది. మరియు ఇది టెక్స్ట్ మెసేజ్ లను మాత్రమే చ్ఛుడవచు వీడియో లు ఫోటో లు చూడలేము.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ని సందర్శించండి.

You may also like

Leave a Comment