నేటి కాలం లో సైబర్ క్రైమ్ లు చాల జరుగుతున్నాయి. మీ ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఒక్కటి ఉంటె చాలు మీ బయో డేటా మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. దాని వళ్ళ చాల మంది సైబర్ నేరాలకు గురి అవుతున్నారు. అలా జరగకుండా ఉండాలి అంటే మీ ఆధార్ తో ఎవరివైనా అపరిచిత ఫోన్ నంబర్లు లింక్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
ఆధార్ తో లింక్ అయినా నంబర్స్ ను తెలుసుకునే ప్రక్రియ: స్టెప్ బై స్టెప్
మీ ఆధార్ తో లింక్ అయినా నంబర్స్ ను తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఈ కింద చెప్పిన ప్రాసెస్ ను ఫాలో అయిపోండి.
స్టెప్ 1: మొదటగా మీ ఫోన్ లో బ్రౌసర్ ఓపెన్ చేయండి. బ్రౌసర్ ఓపెన్ చేసాక దాంట్లో “Sanchar Saathi” అని టైపు చేయండి.
స్టెప్ 2: మొదటగా కనిపించే వెబ్సైటు మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆ లింక్ ఓపెన్ చేసాక కిందకి స్క్రోల్ చేస్తే మీకు “Know Your Mobile Connections” అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4: లింక్ మీద క్లిక్ చేసాక మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
స్టెప్ 5: అప్పుడు మీ ఆధార్ నుంబెర్ కి లింక్ అయినా అన్ని మొబైల్ నంబర్స్ ను చూపిస్తుంది.
స్టెప్ 6: ఒకవేళ మీకు అక్కడ మీకు తెలియని నెంబర్ లు ఉంటె, పక్కనే “Not My Number” అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రిపోర్ట్ కొట్టండి.
ఇక మీ ఆధార్ మరియు మీ మొబైల్ నెంబర్ సేఫ్. ఈ విషయం తెలియని వారికీ షేర్ చేయండి .
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ని సందర్శించండి.