ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తువున్న
అసలింత అలుపే రాదు
ఎనెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న
కాస్తయినా అడ్డే కాదు
నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుంటే ఎంత అన్యాయం
గడియారంలో సెకనుల ముల్లె గంటకి కదిలిందే..
నీతో ఉంటే కరిగే కాలం
నువ్వు లేకుంటే కదలను అంటూ
నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయిందే
హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచేపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా నువ్వొస్తాని ముస్తాబై చూసా
గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తెలోస్తా
నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఉరుకోదు
రాసా రంగులతో ముగ్గేసా చుక్కలతో
నిన్నే చూసేదాకా కనులకు నిద్దురా కనబడదు
నీ పలుకే నా గుండేలకే అలల చప్పుడనిపిస్తుందే
ఈ గాలే విస్తుందే నీ పిలుపల్లే
హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచేపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా నువ్వొస్తాని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు
కల్లో ఉండే నువ్వు కళ్ళకెదురుగుంటే
నేల నింగి అంటూ తేడా లేనంటూ
తారలోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే
ఏ బెంగా లేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే
తీరాక తిప్పేగా ఈ వేదనలే
హైలెస్సో హైలెస్సా నీకోసం సంద్రాలే దాటేసా
హైలెస్సో హైలెస్సా నీకోసం ప్రేమంతా పోగేసా
______________________
సినిమా : తాండల్ (Thandel)
సాంగ్ : హైలెస్సో హైలెస్సా (Hilesso Hilessa)
లిరిక్స్ : శ్రీ మణి (Shree Mani)
గాయకులు: నకాష్ అజీజ్ (Nakash Aziz ) & శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
నటీనటులు : నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) & ఇతరులు
సమర్పకుడు: అల్లు అరవింద్ (Allu Aravind)
రచన, దర్శకత్వం: చందూ మొందేటి (Chandoo Mondeti)
ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.