Home » హే రంగులే (Hey Rangule) సాంగ్ లిరిక్స్ – అమరన్ (Amaran)

హే రంగులే (Hey Rangule) సాంగ్ లిరిక్స్ – అమరన్ (Amaran)

by Lakshmi Guradasi
0 comments
Hey Rangule song lyrics Amaran

మేజర్ ముకుంద్ వరధరాజన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం అమరన్. ఈ సినిమాలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్రను, సాయి పల్లవి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలను పోషించనున్నారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు.

హే రంగులే పాట వివరణ

ఈ సినిమాలో తొలుతగా హే రంగులే అనే పాటను విడుదల చేసారు. విడుదల అయినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లిన ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాటలో శివ కార్తికేయన్ (ముకుందన్) మరియు సాయి పల్లవి (ఇందు రెబెకా వర్గీస్) ప్రేమయాణం గురించి ఉంటుంది. వాళ్ళ జీవితాలలోకి ఒకరికొకరు వచ్చాక వాళ్ళ జీవితం ఎంత అందంగా మారిందో ఈ పాట వివరిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం మీ ప్రియమైన వారితో కలిసి ఈ పాటకి స్వరాన్ని కలిపేయండి.

హే రంగులే సాంగ్ లిరిక్స్ తెలుగు లో

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

సమయానికి తెలిపేదెలా
మనవైపు రా రాదని దూరమై పొమ్మని
చిరుగాలిని నిలిపేదెలా
మన మధ్యలో చేరుకోవద్దని

పరిచయం అయినది
మరో సుందర ప్రపంచం నువ్వుగా
మధువనం అయినది
మనస్సే చెలి చైత్రం జతగా

కలగనే వెన్నెల సమీపించేను నీ పేరుగా
హరివిల్లే నా మెడనల్లెను నీ ప్రేమగా

హే రంగులే (రంగులే)
హే రంగులే (రంగులే)
నీ రాకతో లోకమే
రంగులై పొంగేనే

హే వింతలే కేరింతలే
నీ చేతిలో చెయ్యిగా
ఆకాశం అందేనే

స్నేహమే మెల్లగా గీతలే దాటేనే
కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే
ఊహకే అందని సంగతేదో జరిగే
ఈ క్షణం అద్భుతం అద్భుతం

Hey Rangule Song Lyrics in English

Hey Rangule Rangule
Hey Rangule Rangule

Nee Rakatho Lokame
Rangulai Pongenene
Vinthale Kerintale
Nee Chetillo Cheyiga Aakasam Andene

Snehame Mellaga Geetale Dhatene
Kalame Sakshiga Antharalu Cherige
Oohake Andani Sangatedho Jarige
Ee Kshanam Adbhutam Adbhutam

Samayaniki Telipedela
Manavaipu Raradani Doorame Pommani
Chirugalini Nilipedela
Mana Madhyalo Cherukovaddani

Parichayam Ayanadi
Maro Sundara Prapancha Nuvuga
Madhuvanam Ayanadi
Manasse Cheli Chaitram Jataga
Kalagane Vennela Samipichenu Nee Peruga
Hariville Na Medanallenu Nee Premaga

Hey Rangule Rangule
Hey Rangule Rangule

Nee Rakato Lokame
Rangulai Pongenene
He Vintale Kerintale
Nee Chetillo Cheyiga
Aakasam Andhene

Snehame Mellaga Geetale Dhatene
Kalame Sakshiga Antharalu Cherige
Oohake Andani Sangatedo Jarige
Ee Kshanam Adbhutam Adbhutam

Song Credits

పాట హే రంగులే (Hey Rangule)
చిత్రం అమరన్ (Amaran)
గానం అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni), రమ్య బెహరా (Ramya Behara)
గీత రచయిత సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి (Saraswathiputhra Ramajogayya Sastry)
నటులు శివ కార్తికేయన్ (Siva karthikeyan), సాయి పల్లవి (Sai Pallavi), తదితరులు.
రచన మరియు దర్శకత్వం రాజ్ కుమార్ పెరియసామి (Raj Kumar Periyasamy)
నిర్మాతలు కమల్ హాసన్ (Kamal Haasan), సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ (Sony Pictures International Productions), ఆర్. మహేంద్రన్ (R. Mahendran)
సంగీతంజి వి ప్రకాష్ కుమార్ (G V Prakash Kumar)
ప్రోగ్రామర్అస్విన్ సత్య (Aswin Sathya)

Amaran Movie Songs Lyrics:

Vaane Vaane song lyrics Amaran telugu

Amara Samara song lyrics Amaran telugu

Azadi song lyrics Amaran

vendiminnu neevanta song lyrics amaran telugu

Usure Usure song lyrics Amaran

Kalave Song Lyrics Amaran telugu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.