నా అడుగునే వేస్తూ ఉన్నా నీ అడుగులో
నా మనసునే రాసి ఇచ్చా నీకు ఎప్పుడో
ఏ వైపు కదిలితే ఆ వైపు నిలవక నీ వెంటే కదలనా
నువ్వేమో వెలుగువి నేనేమో నీడను కదా…
హేయ్ మధుమతి.. మనసు కోరే అనుమతి
హేయ్ మధుమతి.. చూడవా మరి ఆ సంగతి…
బయటికే అసలు తెలియని ఏదనస…
పెదవులే ఎప్పుడు పలకని పదనిస…
వాలిపోయి గుండెపైన నువ్వు వింటావా
లోపలున్న శ్వాస నీదే కాదు అంటావా
ఏదైనా అను మరి కాదంటే
అవునని నీక్కూడా తెలియదా..
కాస్తాంత చిలిపిగా అవును నిజమని అను….
హేయ్ మధుమతి.. మనసు కోరే అనుమతి
హేయ్ మధుమతి.. చూడవా మరి ఆ సంగతి…
కనులకే ఎప్పుడు తెలియని కలలనే…
వయసుకే అదుపు తెలియని పరుగునే…
నేర్పినావే నవ్వుతోనే ఏమిటి ఈ మాయ
నాకు కూడా తెలియకుండా నువ్వు అయిపోయావ్
నాకేమి తెలియదే అన్నట్టు
అటు ఇటు చూస్తావే చూస్తావే తెలివిగా..
చాలించి అల్లరి చెయ్యి కలుపదే మరి….
హేయ్ మధుమతి.. మనసు కోరే అనుమతి
హేయ్ మధుమతి.. చూడవా మరి ఆ సంగతి…
______________
Song Credits:
సాంగ్: హేయ్ మధుమతి (Hey Madhumathi)
సినిమా పేరు: LYF (లవ్ యువర్ ఫాదర్)
రచయిత మరియు దర్శకత్వం: పవన్ కేతరాజు (Pavan Ketharaju)
నటన: శ్రీ హర్ష (Sri Harsha), కాశికా కపూర్ (Kashika Kapoor),
సాహిత్యం: రెహమాన్ (Rehman)
గాయకుడు: రోహిత్ (Rohith)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.