Home » ఇలా చేస్తే మీ జుట్టు పెరగడాన్ని ఎవరు ఆపలేరు

ఇలా చేస్తే మీ జుట్టు పెరగడాన్ని ఎవరు ఆపలేరు

by Nikitha Kavali
0 comments
hair growth mask

నేటి కాలం లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. జుట్టు రాలకుండా ఉండడానికి ఎన్నో హాస్పిటల్లకి కూడా తిరుగుతూ ఉంటాం, షాంపు, కండిషనర్లు అంటూ ఎంతో ఖర్చు చేసేస్తున్నం. ఇప్పుడు జుట్టు రాలకుండా ఉండడానికి ఒక అద్భుతమైన హెయిర్ మాస్క్ ఇక్కడ మీకోసం ఉంది. దీనిని వారం లో ఒక్కసారి అయినా పెట్టుకోండి.

కావలసినవి:

అలోవెరా జెల్

కొబ్బరి నూనె

విటమిన్ E కాప్సూల్స్

ఆనియన్ జూస్

హెయిర్ మాస్క్ తయారీ చేసే విధానం

ముందు గా రెండు యెర్రగడ్డలను తీసుకొని మిక్సి పట్టించి జ్యూస్ లా చేయండి. ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ ను, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ను మరియు 3 విటమిన్ కాప్సూల్స్ ను తీసుకోండి. ఇప్పుడు ఈ నాలుగింటిని బాగా కలిసిపోయేలా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు అంత బాగా పట్టించి ఒక అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేయండి.

అలోవెరా జెల్ జుట్టు కుదుళ్ల లో తేమ ఉండేలా చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలకు తోడ్పడుతుంది. కొబ్బరి నూనె జుట్టు ఊడిపోకుండా ఉండడం లోనూ ఇంకా డాండ్రఫ్ ని నియంత్రించడం లో సహాయపడుతుంది. ఇక ముఖ్య మైనది ఆనియన్ జ్యూస్, ఆనియన్ జ్యూస్ కొత్త జుట్టు రావడానికి ఉన్న జుట్టు పొడవుగా అవ్వడానికి ఎంత గానో తోడ్పడుతుంది. విటమిన్ E కాప్సుల్స్ జుట్టు నల్లగా, ఒత్తుగా కనిపించడానికి తొడపడుతుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.