97
ప్రస్తుత కాలం లో జుట్టు రాలడం అనేది సర్వ సాధారణ మరియు అతిపెద్ద సమస్య. ఈ జుట్టు రాలడానికి అనేక కారణాలు వున్నాయి. జుట్టు రాలడం అనేది పెద్ద వయసు వారికే కాక, చిన్న వయసు వారిని కూడా ఎక్కువగా వేధిస్తూ వస్తుంది. అయితే మనం కొన్ని రకాల విధానాలు పాటించడం ద్వారా ఈ జుట్టు రాలె సమస్య నుండి బయట పడవచ్చు.
- ఐరన్, జింక్, విటమిన్లు లో A, D వంటివి మనం తీసుకునే ఆహార పదార్థాలలో లేకపోవడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అందుకే వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, తృణ ధాన్యాలు, గుడ్లు, గింజలు, చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
- కొబ్బరి, బాదం, లేదా ఆలివ్ నూనెలను జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించాలి. నూనెను కొద్దిగా వేడి చేసి తలకు సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి.
- రసాయనాలు అధికంగా ఉండే షాంపూలు, కండిషనర్లు, స్టయిలింగ్ ఉత్పత్తుల వినియోగంతో జుట్టు రాలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది.
- స్ట్రయిట్నెర్లు, కర్లింగ్ ఐరన్ లు వంటి హీట్ స్టైలిష్ సాధనాల వినియోగం తగ్గించడం మంచిది. ఈ పరికరాల నుంచి వచ్చే అధిక వేడి జుట్టును బలహీన పరుస్తుంది.
- కలబంద జెల్ ను నేరుగా తలపై అప్లై చేసి 45 నిమిషాలు ఉంచుకుని తేలికపాటి షాంపూ తో కడిగేయండి. కలబంద ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.