ఎలా తీర్చుకోగలం మీ రుణం
రం రం గురువీరం రం రం గురుధీరం
ఎలా మరచిపోగలం ఆ మంచితనం
రం రం గురువీరం రం రం గురుధీరం
గురువర్య గురువర్య మీ మాటే
మా మనసులకిక వెలుగయ్యా
గురువర్య గురువర్య మీ తోటే
మా బతుకులకోక విలువయ్యా
గురువర్య..
రం రం గురువీరం రం రం గురుధీరం
రం రం గురుశేఖరం ప్రభాకరం ఛ భాస్కరం
మీ దెగ్గర మేము దిద్దిన ఓనమాలు
మాకు మనుషులలో ఇచ్చాయొక్క ఆనవాలు
మేనుల పై మీ బెత్తపు చేతి వ్రాలు
మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు
పొరపాటును సరిచేసే అమ్మధనముగా
గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా
కడదాకా మా కథ నడిపించగా మీ దయ..
గురువర్య గురువర్య మీ బడులే
మా అడుగులకిక గుడులయ్యా
గురువర్య గురువర్య మీ స్మృతులే
మా ఎదలొదలని ముడులయ్యా
గురువర్య..
రం రం గురువీరం రం రం గురుధీరం
రం రం గురుశేఖరం ప్రభాకరం ఛ భాస్కరం
రం రం గురువీరం రం రం గురుధీరం
రం రం గురుశేఖరం ప్రభాకరం ఛ భాస్కరం
ఎలా తీర్చుకోగలం మీ రుణం..
_______________
సాంగ్ : గురువర్య (Guruvarya)
సినిమా: సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)
నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి (Venkatesh Daggubati), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)
గాయకుడు: శ్రీ కృష్ణ (Sri Krishna)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
లిరిక్స్ : అనంత శ్రీరామ్ (Anantha Sriram)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.