Gurtukosthunnayi Song Lyrics In Telugu
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞ్యాపకాలు నిద్ర లేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఈ గాలిలో ఏ మమతలో
మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చుసిన టూరింగ్ సినిమా
మొదట మొక్కిన దేవుని ప్రతిమ
రేగు పండ్లకై పట్టిన కుస్తీ
రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ
కోతి కొమ్మలో బెణికిన కాలు
మేక పొదుగులో తాగిన పాలు
దొంగ చాటుగా కాల్చిన బీడీ
సుబ్బు గాడిపై చెప్పిన చాడి
మోట బావిలో మిత్రుని మరణం
ఏకధాటిగా ఏడ్చినా తరుణం
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటి సారిగా గీసిన మీసం
మొదట వేసిన ద్రౌపది వేషం
నెల పరీక్షలో వచ్చిన సున్నా
గోడ కుర్చీ వేయించిన నాన్న
పంచుకున్న ఆ పిప్పెర్మెంటూ
పీరు సాయబు పూసిన సెంటూ
చెడుగుడాటాలో గెలిచినా కప్పు
షావుకారుకి ఎగవేసిన అప్పు
మొదటి ముద్దులో తెలియనితనం
మొదటి ప్రేమలో తీయందనము
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
ఎదలోతులో ఏ మూలనో
నిదురించు జ్ఞ్యాపకాలు నిద్ర లేస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
Gurtukosthunnayi Song Lyrics In English
Gurtukostunnayi gurtukostunnayi
Yadalotulo yemoolano
Nidurinchu gnapakalu nidralestunnayi
Gurtukostunnayi gurtukostunnayi
Ee galilo ye mamamtalo
Maa amma matalaaga palakaristoonnayi
Gurtukostunnayi gurtukostunnayi
Gurtukostunnayi gurtukostunnayi
Modata choosina tooring cinema
Modata mokkina devuni pratima
Regu pandlakai pattina kusti
Ragi chembuto chesina istri
Koti kommalo benikina kaalu
Meka podugulo tagina paluu
Donga chatuga kalchina beedi
Subbugaadipai cheppina chadi
Moto bavilo mitruni maranam
Ekadhatiga edchina tarunam
Gurtukostunnayi gurtukostunnayi
Gurtukostunnayi gurtukostunnayi
Modati sariga geesina meesam
Modata vesina draupadi vesham
Nela pariikshalo vachchina sunna
Goda kurchi veyinchina nanna
Panchukunna aa pipperment-u
Peeru sayaboo poosina scent-u
Chedugoudatalo gelichina kappu
Shavukarukegavesina appu
Modati muddulo teliyanitanamu
Modati premalo teeyandanamu
Gurtukostunnayi gurtukostunnayi
Yadalotulo yemoolano
Nidurinchu gnapakalu nidralestunnayi
Gurtukostunnayi gurtukostunnayi
Song Credits:
Movie Name: Naa Autograph – Sweet Memories (నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమోరీస్)
Cast: Ravi Teja (రవి తేజ), Bhoomika (భూమిక), Gopika (గోపిక)
Director: S. Gopal Reddy (ఎస్ . గోపాల రెడ్డి),
Music: M. M. Keeravani (ఎం . ఎం . కీరవాణి )
Producer: Bellamkonda Suresh (బెల్లంకొండ సురేష్)
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.