గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే
ఇంక నాతో ఉంటడే
నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే
నీకు గులామైతిలే
గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే
నడుమూ గీరుతూ ఒడ్డాణమై ఉంటడే
గదుమా కిందా పూసే గందమైతడే
పైటను జారకుండా పిన్నిసైతనంటదే
రైకను ఊరడించే హుక్కులుంటడే
ఒడిలో చేరి వాడు వదలను పో అంటాడే
ఆగడు వట్టినట్టు అదుముకుంటాడే
బుగ్గ మీద సిగ్గు మీద ముగ్గోలుంటడే
వాడు
గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే
ఇంక నాతో ఉంటడే
నా పైటకొంగు పాడుగాను నిన్నే కోరెలే
నీకు గులామైతిలే
కో కో కో కోతి బావ ఇంకా పెండ్లి చేసుకోవా
బె బె బె బెండకాయ ముదిరిపోతే దండుగాయ
మాయక్క నీకు దొండపండయ ఓ మేనబావలు
నక్క తోక తొక్కినావయ
సన్నా సన్నా మీసమొచ్చి యాడదన్నా గాలేదే
సూపు మీద సున్నామెయ్య సూడనివన్ని సూతడే
పాపమంటే పాలన్నీ తాగేసే పిల్లోలే నా యంట పడుతుంటే
సూదిపట్టే సందిట్టే సాలు సొరపడుతాడే
హే ఊకో మంటే ఊకోడమ్మా ఉడుంపోరడే
జిడ్డులేక్క అంటుకోని జిత్తులేస్తడే
అరె ఏలువతో గింతసారు కన్నెలు కాలు జారుతారే
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
ఆ చబ్బీ చబ్బీ జబ్బా మీద సబ్బు లెక్క జారిన్నే
రాయి కాండలోడి రొమ్ము మీదనే సోయిదప్పిన్నే
జారుకొప్పు విప్పేసి రింగుల ఉర్లాన్ దుప్పటిచ్చేసిన్నే
వీడువుంటే ఎందుకింకా చెడుగుడు ఆటే
హే బాసింగాలు గట్టుకుంటే బ్యాలెన్స్ అయితడే
పిట్టముడి ఇప్పి నాకు దిట్టీ దీత్తడే
అదిగాని సోకితే సాలు మబ్బుల్లో తేలిపోతనులే
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లసైతిరో కల్లుగిల్లాసైతిరో
ఎహే గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో మందు గిల్లాసైతిరో
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో మందుగిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో నేనే గిల్లాసైతిరో
రసగుల్లానైతిరో నీకు గులామైతిరో…
చిత్రం: మెకానిక్ రాకీ (Mechanic Rocky)
పాట పేరు: గుల్లేడు గుల్లేడు (Gulledu Gulledu Song)
సంగీతం: జేక్స్ బిజోయ్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ (SUDDALA ASHOK TEJA)
గాయకులు: మంగ్లీ (MANGLI)
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
తారాగణం: విశ్వక్సేన్ (Vishwaksen), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath), సునీల్ (Sunil), నరేష్ VK, హైపర్ ఆది, హర్ష వర్ధన్, వైవా హర్ష, రఘురామ్ తదితరులు.
మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.