చెప్పులు కుట్టే టోడినాని చెప్పకుండా పోయినావ
తక్కువ జాతే నాదని తప్పుకుని పోయినావ
తల్లడిల్లుతుందే గుండె తల్లి తోడు నువ్వు లేక
సిన్న సూపు అయ్యానేమో ఆగిపోతి మాటరాక
నేను చేసిన నేరం ఏందో తెలువదే
నువ్వు సూడకపోతే పాణం పోతాదే
నేను చేసిన నేరం ఏందో తెలువదే
నువ్వు సూడకపోతే పాణం పోతాదే
మట్టిన పుట్టిననే మహారాజునే
మెట్టెలే నీకు తొడగలేనా
తనువే తగలెట్టిన నిన్ను విడవనే
తాళిని నీకు కట్టలేన
నన్ను కన్న జాతి మీద ఒట్టే
నమ్మి సూడు మాటివనా
దేవుడున్న కోవెలలాగా
నీకు చుట్టూ నేనుండాన
ఇంత బాధ నే చెప్పుతున్న
నన్ను విడకే చిట్టిదనా
రాత రాసినోడు చావు దెబ్బ
కొట్టినాడే ఏమి సేయ్యనే
నేను చేసిన నేరం ఏందో తెలువదే
నువ్వు సూడకపోతే పాణం పోతాదే
నేను చేసిన నేరం ఏందో తెలువదే
నువ్వు సూడకపోతే పాణం పోతాదే
ఒందని తవ్వేతోడ్తోని నీ బంధమే
అంధ వికారం అయితుందా
తోలుర కుట్టేటోనికి ఆలివై
అవమానాలే పడతావా
పాడెనే కట్టేటోడిని పారాణి పూసితే తప్ప
నీ కాలే ముట్టెటోడితో ఏడు అడుగులేస్తే తప్ప
డప్పు కొట్టేటోడ్ని నేనన్ని దిక్కులేనోన్ని చెయ్యకే
కష్టాన్ని పెట్టేటోనికే కన్నీళ్లు మిగిలించి పోకే
నేను చేసిన నేరం ఏందో తెలువదే
నువ్వు సూడకపోతే పాణం పోతాదే
నేను చేసిన నేరం ఏందో తెలువదే
నువ్వు సూడకపోతే పాణం పోతాదే
_______________________________________
పాట: చెప్పులు కుట్టే టోడినాని (Cheppulu kutte todinani)
సాహిత్యం: నాగరాజు కసాని (Nagaraju Kasani)
గాయకుడు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav)
సంగీతం : ఇంద్రజిత్ (Indrajith)
దర్శకుడు: మోహన్ మర్రిపెల్లి (Mohan Marripelli)
నిర్మాత: తెలుగు రాఘవేందర్ ముధీరాజ్ (Telugu Raghavender Mudhiraj)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.