భారతీయ రైల్వేలు అనేక రంగుల రైళ్లను నడుపుతుంది. ఇందులో ఆకుపచ్చ, ఎరుపు మరియు నీలం, గోధుమ రంగు రైళ్లు ఉంటాయి. భారతీయ రైల్వేలోని రంగుల రైళ్ల వేగం గురించి సమాచారం ప్రకారం, ఎరుపు రంగు రైళ్లు వేగంగా నడుస్తాయి. దేశంలో టెక్నాలజీ పెరిగిపోతుంది. రైళ్లు వివిధ రంగులలో ఉంటాయి. రైలు రంగును బట్టి స్పీడ్ కూడా ఉంటుందనే మీకు తెలుసా….
రైళ్ల వేగాలు
ఎరుపు రంగు రైళ్లు: ఈ ఎరుపు కోచ్లు, లింకే హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లు అని పిలవబడతాయి, ఇవి అల్యూమినియం నిర్మాణంతో ఉండి, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఉపయోగిస్తారు. వీటి గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
నీలం రంగు రైళ్లు: వీటి వేగం సాధారణంగా గంటకు 70 నుండి 140 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.
ఆకుపచ్చ రంగు రైళ్లు: ఇవి గరీబ్ రథ్ వంటి రైళ్లలో ఉంటాయి మరియు వీటి గరిష్ట వేగం 130 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
అందువల్ల, ఈ మూడు రంగులలో ఎరుపు రంగు రైళ్లు అత్యంత వేగంగా నడుస్తున్నాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టెక్నాలజీను సందర్శించండి.