పాడుబడ్డ బావి పక్క.. దెయ్యాల చింత చెట్టు
గంట పది కొట్టింది ఎవరు పోరు ఆ తట్టు
చేతబల్ల చెరువు గట్టు.. పిశాచాలే దాని చూట్టు
తలుచుకుంటే ఆ చోటు వెన్నులోన వణుకు పుట్టు
శబ్దం…
అమావాస్య రాతిరది వీధులన్నీ ఖాళీ ఖాళీ
చూరుమీద గెంతినాది మెల్లకన్ను నల్లపిల్లి
సంబరణి వాసనతో గుంపుమంది హోరు గాలి
దీపమార్పి నిద్దరోయే గ్రామదేవి పైడితల్లి
శబ్దం…
మసీదు వాకిలిలో సైతాను కెవ్వుకేక
కల్వరి గుడి వెనక అక్కుపక్షి తయ్య తక్క…
తయ్య తక్క…
కోట గోడ అంచు మీద గుడ్లగూబ రోదనయ్యే
గుంపు కుడి వంత పాడి కందిరీగల రోదయే
వళ్లకాటి సమాధిపై ఒంటి కాకి కావుమనే
గుక్క తిప్పుకోకుండా గుంట నక్క గొల్లుమనే
కప్పు కింద బల్లి శబ్దం
తాటాకు రాలిన శబ్దం
వీధి కుక్క మొరిగే శబ్దం
తెలియని ఏదో శబ్దం
ఆమడంతా దూరంలో .. పురిటి తల్లి మూలుగు శబ్దం
పలుపు తాడు తెంచుకున్న… ఆబోతు రంకె శబ్దం
పాకలోని మేకలన్నీ కకావికలైన శబ్దం
జామురేయి ఎవరిదో చావు డప్పు మోగే శబ్దం
మంత్రాల ఫకీరు చెప్పే మాయ మంత్రం కథ కాదే
చంటోళ్లను భయపెట్టే బూచోడి కథ కాదే
తాత ముత్తాతమ్మల భూతాల కథ కాదే
విక్రమాదిత్యుడు చెప్పిన బేతాళుడి కథ కాదే
దీపము నుండి దెయ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కాదే
ఇది ముడత చర్మం ముసలి చెప్పే కథలాంటి నిజమేలే….
నిజమేలే…
శబ్దం… శబ్దం… శబ్దం…
_______________
Song Credits:
పాట పేరు : అమ్మమ్మ పాట (Grandma Song)
చిత్రం: శబ్దం (Shabdham) (Telugu)
సంగీతం: థమన్.ఎస్ (Thaman.S)
గాయకుడు : సాహితీ చాగంటి (Sahithi Chaganti)
సాహిత్యం : “సరస్వతీపుత్ర” రామజోగయ్య శాస్త్రి (“Saraswathiputhra” Ramajogayya Sastry)
నటీనటులు: ఆది (Aadhi), లక్ష్మీ మీనన్ (Lakshmi Menon),
రచన & దర్శకత్వం: అరివఝగన్ (Arivazhagan)
నిర్మాత: 7G శివ (7G Siva)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.