గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
శంకర తనయ, షణ్ముఖ సోదర,
శంకర తనయ, షణ్ముఖ సోదర,
విఘ్నాలు బాపే వినాయకుడు నువ్వే దేవ
విఘ్నాలు బాపే వినాయకుడు నువ్వే దేవ
చిన్నారిపాపల్లోన, చిరునవ్వులునువ్వేనయ్యా
చిన్నారిపాపల్లోన, చిరునవ్వులునువ్వేనయ్యా
మా పాడిపంటల్లోన, తోడుండే దేవుడవయ్యా
మా పాడిపంటల్లోన, తోడుండే దేవుడవయ్యా
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
మూషిక వాహన, ముక్కంటి తనయా
మూషిక వాహన, ముక్కంటి తనయా
ముల్లోకాలను ఏలగ రారా ముద్దుల గణపయ్యా
ముల్లోకాలను ఏలగ రారా ముద్దుల గణపయ్యా
చిట్టి గణపయ్య పొట్టి గణపయ్య
చిట్టి గణపయ్య పొట్టి గణపయ్య
ఎలుక వాహనం ఎక్కి రారా సిద్ధి గణపయ్యా
ఎలుక వాహనం ఎక్కి రారా సిద్ధి గణపయ్యా
మా తల్లి దండ్రివి నువ్వే, మా ధైవం నువ్వే నయ్యా
మా తల్లి దండ్రివి నువ్వే, మా ధైవం నువ్వే నయ్యా
మనసారా నిను కొలిచేము, మదినిండా తలిచేమయ్య
మనసారా నిను కొలిచేము, మదినిండా తలిచేమయ్య
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గణపయ్య గణపయ్య బొజ్జ గణపయ్య
గణపయ్య గణపయ్య బొజ్జ గణపయ్య
కుప్పలు కుప్పలు కుడుములు నికే జేసినమయ్యా
కుప్పలు కుప్పలు కుడుములు నికే జేసినమయ్యా
సిద్ధి గణపయ్య,బుద్ధి గణపయ్య
సిద్ధి గణపయ్య,బుద్ధి గణపయ్య
తీరొక్క దళములు,పూలు, పండ్లు పెట్టితిమయ్యా
తీరొక్క దళములు,పూలు, పండ్లు పెట్టితిమయ్యా
బాధలో ఉన్న మాకు, బంధువుల రావాలయ్యా
బాధలో ఉన్న మాకు, బంధువుల రావాలయ్యా
పాపాలు దోషాలు ఉన్నా, తొలగించగ రావాలయ్యా
పాపాలు దోషాలు ఉన్నా, తొలగించగ రావాలయ్యా
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
శరణు గణేశ శాంభవి పుత్ర
శరణు గణేశ శాంభవి పుత్ర
విద్యల దోరవు నువ్వేనయ్యా ఓ విగ్న రాజ
విద్యల దోరవు నువ్వేనయ్యా ఓ విగ్న రాజ
గజముకేశ్వర శ్రీ గణనాథా
గజముకేశ్వర శ్రీ గణనాథా
ఎల్లలోకములు ఏలే తండ్రి ఓ విగ్న రాజ
ఎల్లలోకములు ఏలే తండ్రి ఓ విగ్న రాజ
సిరి సంపదలిచ్చే తండ్రి, సిద్ది గణపయ్యావు నీవే
సిరి సంపదలిచ్చే తండ్రి, సిద్ది గణపయ్యావు నీవే
ధన ధాన్యాలిచ్చే తండ్రి, దండి గణపయ్యావు నీవే
ధన ధాన్యాలిచ్చే తండ్రి, దండి గణపయ్యావు నీవే
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
నందీశ్వర సుత నవ్య విలాస
నందీశ్వర సుత నవ్య విలాస
నాలు దిక్కులలో ఎక్కడ చూసిన నువ్వేనయ్యా
నాలు దిక్కులలో ఎక్కడ చూసిన నువ్వేనయ్యా
కరిముఖదేవ కరుణాల వాలా
కరిముఖదేవ కరుణాల వాలా
కలియుగమంతా కాచే తండ్రి నువ్వేనయ్యా
కలియుగమంతా కాచే తండ్రి నువ్వేనయ్యా
మా వాడ వాడన నిలిపి పండుగలే జరిపేమయ్య
మా వాడ వాడన నిలిపి పండుగలే జరిపేమయ్య
నవరాత్రులు నీ పూజలతో వేడుకలు జరిపేమయ్య
నవరాత్రులు నీ పూజలతో వేడుకలు జరిపేమయ్య
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయ
గౌరమ్మ గంగమ్మ ముద్దుల తనయా
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
గడియ గడియ మా గండాలు బాపే గజముఖదేవ
శంకర తనయ, షణ్ముఖ సోదర,
శంకర తనయ, షణ్ముఖ సోదర,
విఘ్నాలు బాపే వినాయకుడు నువ్వే దేవ
విఘ్నాలు బాపే వినాయకుడు నువ్వే దేవ
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
