Home » ఘల్లు ఘల్లుమని సాంగ్ లిరిక్స్ – ఇంద్ర

ఘల్లు ఘల్లుమని సాంగ్ లిరిక్స్ – ఇంద్ర

by Vinod G
0 comments
ghallu ghallu

ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా

జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా

జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని

నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని

జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల

రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల

రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా

జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని

ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపని

అన్నెం పున్నెం ఎరుగని మాసీమకు రా రమ్మని

ఆహ్వానం అందించనీ మెరిసే చూపుని

తొలగింది ముప్పు అని నీలిమబ్బు మనసారా నవ్వని

చిరుజల్లుముంపు మన ముంగిలంతా ముత్యాలె చల్లని

ఆ సాసు గంధయై నేలంతా సంక్రాంతి గీతమై పాడేల

శాంతిమంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈవేళ

జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల

రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

భువిపై ఇంద్రుడు పిలిచెర కరుణా వరదై పలకర

ఆకసాన్ని ఇలదించర మురిసే వానగ

మారని యాతన తీర్చగ మా తలరాతలు మార్చగ

ఈ జలయజ్ఞము సాక్షిగ తలనే వంచర

మహరాజు తానె ప్రమిదల్లె మారి నిలువెల్లా వెలిగెర

బోగాన్ని విడిచి త్యాగాన్ని మలచి తాపసిగా నిలిచెరా

జన క్షేమమె తన సంకల్పముగ తన ఊపిరె హొమ జ్వాలలుగ

స్వర్గాన్నె శాసించెనుర అమృతమును ఆహ్వానించెనుర

జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల

రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా

జల్లు జల్లుమని పులకింతల్లో పుడమే పాడగా

హరివిల్లు ఎత్తి కరిమబ్బువాన బాణాలే వేయని

నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగల్లే తీరని

జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల

రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

జడివాన జాడతో ఈవేళ జనజీవితాలు చిగురించేల

రాళ్ళసీమలో ఈవేల రతనాల దొరలే కురిసేల

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.