Home » గీత గీయరాదు రాత రాయరాదు సాంగ్ లిరిక్స్ – Folk Song

గీత గీయరాదు రాత రాయరాదు సాంగ్ లిరిక్స్ – Folk Song

by Lakshmi Guradasi
0 comment

ఆమె : గీత గీయరాదు రాత రాయరాదు
చదువుకోలేదురో ఓ సంజూరెడ్డి
చదువు నేర్పుదురో ఓ సంజూరెడ్డి

అతడు : బాయి కట్టాకాడా కడుగాల అడ్డాకాడా
రోజు కాల్వే పిల్ల ఓ నీలవేణి
చదువు నేర్పిస్తానే ఓ రంగసాని

ఆమె : ఆడపిల్లలతోని అగ్గి పెట్టేలతోని
ఆటలాడకుదురో ఓ సంజూరెడ్డి
కాలిపోతాదురో ఓ సంజూరెడ్డి

అతడు : చదువుకున్న వాడ్ని చక్కగున్నవాడ్ని
చెయ్యిపట్టా రావే ఓ నీలవేణి
జంటకట్టా రావే ఓ రంగసాని

ఆమె : చేయ్యిపట్టమంటూ జంట కట్టమంటూ
వెంటపడకు పిల్లగా ఓ సంజూరెడ్డి
వెళిపోవోయ్ పిల్లగా ఓ సంజూరెడ్డి

అతడు : చూడ చక్కనిదాన చేత చిక్కనిదాన
నిన్ను విడవనే పిల్లా ఓ నీలవేణి
నిన్ను మరవనే పిల్లా నా రంగసాని

ఆమె : వాడి కొట్టుకున్నా ఎంత మొత్తుకున్నా
నిన్ను కానను పిల్లగా ఓ సంజూరెడ్డి
కంట చూడను పిల్లగా ఓ సంజూరెడ్డి

అతడు : ఇంత కోపమేందే అంత మాటలేందే
నిన్ను ఏమంటినే ఓ నీలవేణి
నిన్ను ప్రేమిస్తీనే నా నీలవేణి

ఆమె : కోపమేది లేదు కొట్లాటలేదు
ఇంట్లో ఒపుకోరోయ్ ఓ సంజూరెడ్డి
నన్ను తిట్టుతారోయ్ ఓ సంజూరెడ్డి

అతడు : నీకు భయ్యముంటే నిన్ను ఇయ్యానంటే
మా వోళ్ళతోని ఓ నీలవేణి
నీ ఇంటికి వస్తా నువ్వు రయ్యే రాణి

ఆమె : నన్ను మేచ్చుడొద్దు ఇంటికి వచ్చుడోద్దు
నీ దారి నువ్వు చూసుకోవోయ్ దొరా
నా దారి నేను వెళ్ళిపోతా దొరా

అతడు : చావనైనా చత్త ప్రాణమైన ఇత్త
నిన్ను ఇడిచి బతకా ఓ నీలవేణి
మనువు చేసుకుంటా నిన్ను నీలవేణి

ఆమె : నాకు నచ్చినావు మాట మెచ్చినాను
ఏమన్నాగాని ఓ సంజూరెడ్డి
యేలు పడతా పోనీ ఓ సంజూరెడ్డి

అతడు : కష్టమంటే ఏంటో తెలియకుండా
నిన్ను చూసుకుంటా రయ్యే ఓ నీలవేణి
ముద్దుగా చూస్తానే నా పుల్లావని

ఆమె : నీకు పుల్లాన్నయ్యి నీకు అమ్మనయ్యి
కాపాడుకుంటా నా సంజూరెడ్డి
కలిసి మెలిసి వుంటా ఓ సంజూరెడ్డి

అతడు : తాళి కట్టుకుంటే మెట్టెలేట్టుకుంటా
యేలు పట్టి రయ్యే ఓ నీలవేణి
యేలుకుంటా రయ్యే నా నీలవేణి

యేలు పట్టి రయ్యే ఓ నీలవేణి
యేలుకుంటా రయ్యే నా నీలవేణి

_____________________________________________________

పాట: గీత గీయరాదు రాత రాయరాదు (Geetha Giyaradhu Ratha Rayaradhu)
ట్యూన్ సోర్స్ : శ్రీను శ్రీకాకుళం (Srinu Srikakulam),మాణిక్యవ్వ ( Manikyamavva)
గాయకుడు & సాహిత్యం: జోగుల వెంకటేష్ (Jogula Venkatesh)
గాయని: లావణ్య (Lavanya)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
తారాగణం: జోగుల వెంకటేష్ (Jogula Venkatesh), ఆసియా నూకరాజు (Asiya Nookaraju)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment