AI టెక్నాలజీ అభివృద్ధితో మన ఫోటోలను అనేక స్టైల్స్‌లోకి మార్చుకోవడం సులభమైంది. ప్రత్యేకంగా, ఘిబ్లీ-స్టైల్ పోర్ట్రెట్లు సృష్టించేందుకు Grok 3, ChatGPT, Gemini AI వంటి మోడల్స్ అద్భుతంగా సహాయపడతాయి.
Grok 3, ChatGPT, Gemini AI ద్వారా ఘిబ్లీ-స్టైల్ పోర్ట్రెట్లు సృష్టించడం:
Grok 3 ద్వారా:
Grok 3 ఉపయోగించేందుకు, Grok వెబ్‌సైట్ లేదా X (Twitter) యాప్‌లోని Grok ఐకాన్‌ను క్లిక్ చేసి యాక్సెస్ పొందండి. చిత్రాలను రూపొందించగలిగే తాజా మోడల్‌ను ఎంచుకుని, అవసరమైన సెట్టింగ్‌లను అమర్చండి. పేపర్ క్లిప్ ఐకాన్ పై క్లిక్ చేసి, మంచి కాంతి, స్పష్టమైన వివరాలతో ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఘిబ్లీ-స్టైల్ పోర్ట్రెట్ కోసం సరైన ప్రాంప్ట్ ఇవ్వాలి. ఉదాహరణగా:
👉 “ఘిబ్లీ-స్టైల్ పోర్ట్రెట్, పెద్ద నీలం కళ్లతో, మృదువైన రంగుల కలయిక, జపనీస్ ఎనిమి వాతావరణంలో, కలల ప్రపంచం బ్యాక్‌గ్రౌండ్‌గా.”
ఫలితం మీరు ఆశించిన విధంగా రాకపోతే, ప్రాంప్ట్ మార్చి మళ్లీ ప్రయత్నించండి లేదా Canva, Photoshop వంటి టూల్స్‌తో మెరుగుదల చేయండి.
ChatGPT ద్వారా:
ChatGPT లో ఇమేజ్ జనరేషన్ కోసం, GPT-4o వంటి సరైన వెర్షన్‌ను ఎంచుకుని, Image Feature యాక్సెస్ ఉందో లేదో పరిశీలించండి. ఘిబ్లీ-శైలి వాతావరణాన్ని సృష్టించేందుకు సరైన ప్రాంప్ట్‌ను ఉపయోగించండి. ఉదాహరణగా:
👉 “సాయంత్రపు ప్రశాంత గ్రామం, ఆకుపచ్చ కొండలు, రాళ్ల బాట, మెత్తని రంగుల హాయిగల వాతావరణం.“
మీరు ఓ ఫోటోను అప్‌లోడ్ చేసి, దాన్ని ఘిబ్లీ-స్టైల్ కళాకృతిగా మార్చాలనుకుంటే, ఈ విధంగా ప్రాంప్ట్ ఇవ్వండి:
👉 “ఈ చిత్రాన్ని Studio Ghibli శైలి కళాకృతిగా మార్చండి, మృదువైన షేడింగ్, కలల మాదిరి కాంతులు, పెయింటింగ్‌లా కనిపించే ప్రభావంతో.”
ఫలితం అనుకున్నట్లుగా లేకుంటే, ప్రాంప్ట్ మార్చి మళ్లీ ప్రయత్నించండి లేదా ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి మెరుగుదల చేయండి.
Gemini AI ద్వారా:
Gemini AI ఉపయోగించాలంటే, Google అధికారిక వెబ్‌సైట్ లేదా iOS/Android కోసం Gemini యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, Google అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత, “Create” లేదా “Generate Images” విభాగాన్ని తెరవండి. ఘిబ్లీ-స్టైల్ చిత్రాన్ని రూపొందించేందుకు సరైన ప్రాంప్ట్‌ను ఉపయోగించండి, ఉదాహరణగా:
👉 “ఘిబ్లీ-శైలిలో ఆకుపచ్చ అడవిలో ఒంటరిగి ఉన్న చెక్క ఇంటి దృశ్యం, పక్కన చిన్న నదీ ప్రవాహం, మృదువైన ప్యాస్టెల్ రంగులు, కలల మాదిరి వాతావరణం.”
శైలి మరింత స్పష్టంగా పొందేందుకు ప్రాంప్ట్‌లో ఈ వివరాలను జోడించండి:
– Hand-drawn (చిత్రలేఖనం మాదిరి)
– Soft lighting (మృదువైన కాంతి)
– Pastel tones (నెమ్మదైన రంగుల మిశ్రమం)
– Whimsical details (అద్భుతమైన వివరాలు)
టెక్స్ట్ బాక్స్‌లో ప్రాంప్ట్ నమోదు చేసి, “Generate” బటన్ నొక్కండి. కొన్ని సెకండ్లలోనే Gemini AI మీ వివరణ ఆధారంగా చిత్రం రూపొందిస్తుంది.
Ex. Prompt: సూర్యాస్తమయ సమయంలో ఒక ప్రశాంతమైన గ్రామీణ గ్రామం, పచ్చని కొండలు, వంపులు తిరుగుతున్న నది, ఐవీతో కప్పబడిన హాయిగా ఉండే చెక్క ఇల్లు. గడ్డి టోపీ మరియు చిన్న ఆత్మ లాంటి జీవి ధరించిన ఒక యువతి వరండాలో కూర్చుని, వెచ్చని సాయంత్రం వెలుగులో మిణుగురు పురుగులు నృత్యం చేస్తుండగా చూస్తోంది. ఈ దృశ్యం మృదువైన పాస్టెల్ రంగులు, కలలు కనే లైటింగ్ మరియు స్టూడియో గిబ్లి చిత్రాల విచిత్రమైన మనోజ్ఞతను సంగ్రహించే మాయా వాతావరణంతో నిండి ఉంది.
Image Output:

ఘిబ్లితో పాటు ఇతర మోడళ్లను ప్రయత్నించండి:
AI మోడల్స్ ద్వారా మన ఫోటోలను ఘిబ్లీ, మార్వెల్, ఎనిమి, ఇండియన్ కింగ్, సైబర్‌పంక్ వంటి అనేక స్టైల్స్ లో మార్చుకోవచ్చు.
- Marvel-స్టైల్ ప్రాంప్ట్:
“Marvel-style superhero with ultra-realistic details, powerful stance, glowing energy effects.”
- Anime-స్టైల్ ప్రాంప్ట్:
“Studio Ghibli style anime character, soft shading, pastel colors, cinematic background.”
- Indian King-స్టైల్ ప్రాంప్ట్:
“Portrait of an Indian Maharaja, royal golden attire, intricate details, grand throne.”
- Cyberpunk-స్టైల్ ప్రాంప్ట్:
“Futuristic cyberpunk warrior, glowing neon lights, high-tech helmet, Blade Runner aesthetic.”
👉 📷 మీ ఫోటోను అప్‌లోడ్ చేసి, స్టైల్ మార్చండి:
“ఈ చిత్రాన్ని Marvel/Anime/Indian King/Cyberpunk స్టైల్ లో మార్చండి, realistic lighting & high-detail shading తో.”
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ను చూడండి.