Home » భార్యభర్తల మధ్య మంచి బంధం కోసం …

భార్యభర్తల మధ్య మంచి బంధం కోసం …

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! ప్రస్తుత కంప్యూటర్ యుగంలో భార్య భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు కారణంగా చూపి విడిపోతున్నారు. వీరి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. అయితే వీరి మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు కారణంగా విడిపోకుండా, వారి బంధం బలంగా జీవితాంతం కొనసాగాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పునిసరిగా పాటించాలి.

ప్రేమ, బాధ్యత ఇందులో ఏది తగ్గినా కాపురంలో గొడవలు తప్పవు. బంధం బీటలువారే ప్రమాదం ఉంటుంది. కాపురం సజావుగా సాగాలంటే కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య అవగాహన, పరస్పర సహకారం ఉండాలని సూచిస్తున్నరు నిపుణులు.

ఆఫీసు నుంచైనా, పని ప్రదేశం నుంచి ఇంటికెళ్లాక ఇద్దరూ కాసేపు ప్రశాంతంగా మాట్లాడుకోండి. సంబాషణల్లో దాపరికం, అపార్ధాలు లేకుండా చూసుకోండి. ఇద్దిరూ చేస్తున్న పనుల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకోవాలి. కొన్నిసార్లు కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్లు అపార్ధాలు వస్తాయి.

కొన్నిసార్లు కుటుంబపరంగా, ఆర్ధికంగా కొన్ని సవాళ్లు ఎదురుకావొచ్చు. అప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా ఒకరికొకరు అండగా నిలవాలి. నీకు నేను ఉన్నాను అన్న భరోసా ఇద్దిరి మధ్య ఉంటే భార్యభర్తల బంధం దృడంగా ఉంటుంది.

ప్రతిరోజూ ఆఫిసు, ఇంటి పనులు, బయటి పనులంటూ సమయం అంతా వాటికే కేటాయించకండి. మీకోసం ఇంటి దగ్గర ఎదురుచూసే భాగస్వమీ కోసం కాస్త సమయాన్ని తప్పక కేటాయించండి.లేదంటే వారిని మీరు పక్కన పెడుతున్నారన్నా భావన కలుగుతుంది. అది మీ మధ్య దూరం పెరగడానికి కారణం కావొచ్చు.

ఇంట్లో మీ భాగస్వమీ చేసే ఆహార పదార్ధాలు బాగున్నప్పుడు గాని లేదా ఇంటిని అందంగా ఉంచినప్పుడు ఆమెకు ప్రశంసలు ఇవ్వండి. ఇది వారికి ఆనందం కలిగించడంతో పాటు మీపై ప్రేమను కూడా పెంచుతుంది. దీనివలన మీ రిలేషన్ షిప్ మరింత బలంగా తయూరవుతుంది.

భార్యాభర్తల బంధంలో ప్రేమ, ఒకరిపై ఒకరు కేరింగ్ గా ఉండటం అనేది చాలా ముఖ్యం. అలాగే వీలు కుదిరినప్పడు అలా బయటకు వెళ్లండి. దీనివల్ల మీరు రీఫ్రెష్ గా ఉండటమే కాకుండా మీ బంధానికి మరింత బూస్ట్ ఇస్తుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment