Home » ఆది జ్వాల (Fire Song) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

ఆది జ్వాల (Fire Song) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

by Vinod G
0 comment

ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా

ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా

ఈ మట్టి ముట్టే ముందే
ఇక్కడ పుట్టింది మేమే మేమే
అంకెలు పుట్టకముందే
లెక్కలు కనిపెట్టింది మేమే మేమే

కొండెక్కనీకుండా ఈ నిప్పునే కాచాము
పెనుముప్పే ముందున్నా భయపడని తెగరా

రా ఓ కత్తి పట్టి రా రోంమెత్తి పెట్టి రా దండెత్తి కొట్టరా రా..
రా ఓ కత్తి పట్టి రా రోంమెత్తి పెట్టి రా దండెత్తి కొట్టరా రా ర రా ర

ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా

సుడిగాలులు వడగాలులు విసిరెను విలయం
పిడుగాగ్ని జడి వానలు జల్లెను ప్రళయం
ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్న
వణికించి నిలబడినోళ్ళం

బడబాగ్నుల ఒడిలో పడి పెరిగిన వాళ్ళం
జఠరాగ్నుల జడిలోపల నలిగిన వాళ్ళం
పంచాంగ్నుల కోరలతో మన పంచ ప్రాణాలే
పోరాడి గెలిచిన వాళ్ళం

ఎగిసిపడే అగ్గిజలం మీద పడే కొండ బిలం
దాటగలే గుండెబలం మనికి ఓ వరం
మొరటుతనం మొండి ఘటం యెరుగమట ఏ కపటం
నిప్పులతో చెలగాటం మనకి సంబరం

అగ్గి సేఖ వాయు సేఖ నీటి సేఖ రాతి సేఖ
ఒక్కటిగా ఎదురైనా బెదురు యెరుగమే
అగ్నికణం వీరగుణం ఆణువణువూ బతుకు రణం
ఆయుధమై అణిచేసే నాటకకులమే

రా ఓ కత్తి పట్టి రా రోంమెత్తి పెట్టి రా దండెత్తి కొట్టరా
రా ఓ కత్తి పట్టి రా రోంమెత్తి పెట్టి రా దండెత్తి కొట్టరా రా ర రా ర

ఆది జ్వాల అనంత జ్వాల
వైర జ్వాల వీర జ్వాలా
దైవ జ్వాల దావాగ్ని జ్వాల
జీవ జ్వాల ప్రాణ జ్వాలా

రా రా రా రా
రా రా రా ర రా ర


చిత్రం: కంగువ (Kanguva)
గాయకులు: అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్
సాహిత్యం: శ్రీమణి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ (‘Rockstar’ Devi Sri Prasad)
దర్శకత్వం: శివ (Siva)
తారాగణం: సూర్య (Suriya), దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్ (Bobby Deol) తదితరులు

యోలో (Yolo) సాంగ్ లిరిక్స్ – కంగువ (Kanguva)

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment