Home » ఫాలింగ్ ఇన్ లవ్ న్యూయార్క్ సాంగ్ లిరిక్స్ – Music Love song

ఫాలింగ్ ఇన్ లవ్ న్యూయార్క్ సాంగ్ లిరిక్స్ – Music Love song

by Lakshmi Guradasi
0 comments
Falling In Love New York song lyrics

మిల మిల మెరుపుల నువ్వు నవ్వగానే
మనసుకే మతి చెడే మరి అంతలోనే

ఎవ్వరివే ఎవ్వరివే నువ్వు ఇంత కాలం
కన్నులకే కలవక ఎటు ఉన్నవే
చెలి నిన్నే నిన్నే చూడగా
ఎద నిండా పొంగే నర్మదా
ఇది నిన్న మొన్న లేదుగా
నిన్ను ప్రేమిస్తున్న సర్వదా
మరి మరి నిన్ను మరి
వదిలితే ఊపిరాగిపోదా

మిల మిల మెరుపుల నువ్వు నవ్వగానే
మనసుకే మతి చెడే మరి అంతలోనే
నువ్వే నువ్వే కలిసేదాక నాలో మనసే
నాతో పాటే ఎప్పుడు తోడుగా ఉండేది
నువ్వే నువ్వే పిలిచేదాక నాలో మనసే
నా మాటల్నే ఎప్పుడు బుద్ధిగా వినేది

మనసుతో మనసుకి అనుబంధమే కుదిరితే
మనసోదే వినవనీ ఇప్పుడే తెలిసే
అడుగుకే అడుగుకే సరి హద్దులే చెరిగితే
మిల మిల తమకమే కురిసే

చెలి నిన్నే నిన్నే చూడగా
జన్మించా నేనే కొత్తగా
ఇక నన్నేనన్నే మెల్లగా
వదిలేసా నీలో పూర్తిగా
అనుదినం పరవశం కలిగెను అందుకే ఇలాగా

మిల మిల మెరుపుల నువ్వు నవ్వగానే
మనసుకే మతి చెడే మరి అంతలోనే

నిమిషము నిమిషము నీ మీద ప్రేమే
పెరుగుతూ మనసులో బరువెక్కిపోయే
ఎదురుగా ఇప్పుడిలా నిన్ను చూడగానే
కన్నులలే తడిమిన తడి ఆరిపోయే

_________________________________

పాట పేరు: ఫాలింగ్ ఇన్ లవ్ న్యూయార్క్ (Falling In Love New York)
గాయకులు: అదితి భావరాజు (Aditi Bhavaraju), సిద్ధిక్ అన్సారీ (Siddiq Ansari)
సంగీతం: మార్కస్ ఎమ్ (Marcus M)
సాహిత్యం: సురేష్ బనిశెట్టి (Suresh Banisetti)
విజన్ & దర్శకత్వం: దిలీప్ కుమార్ కాజా (Dilip Kumar Kaza)
ప్రధాన తారాగణం: దిలీప్ కుమార్ కాజా (Dilip Kumar Kaza), ప్రియాంక మత్తడి (Priyanka Mattadi), జయంద్ర లాడే (Jayandra Lade)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.