Home » ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు సాంగ్ లిరిక్స్ రాజు భాయ్ 

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు సాంగ్ లిరిక్స్ రాజు భాయ్ 

by Lakshmi Guradasi
0 comments
Evvare Nuvvu song lyrics Raju Bhai

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు

ఎటు చూసినా ఏంచేసినా ఏదారిలో అడుగేసినా
నలువైపులా నా ఎదురే ఉందామైనా మైనా
ఏ మబ్బులో దోగాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా అనుకోనిదే జరిగిందిగా
నా తీరుతెన్ను మారుతోందిగా

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు

దేవతా దేవత దేవత దేవత
అది నా దేవత
దేవతా దేవత దేవత దేవతా

చెలి చూపులో చిరుగాయమై మలిచూపులో మటుమాయమై
తొలిప్రేమగా నే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నలన్నీ శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తీయని దిగులై పడి ఉన్నాను చెలిలేనిదే బ్రతికేదెలా
ఏ ఊపిరైన ఉత్తిగాలిలే

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు

__________________

పాట: ఎవరే నువ్వు (Evare Nuvvu)
చిత్రం: రాజు భాయ్ ( Raju Bhai)
తారాగణం: మనోజ్ మంచు (Manoj Manchu), షీలా కౌర్ (Sheela Kaur)
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా (Harish Raghavendra)
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
గాయకులు: హరీష్ రాఘవేంద్ర

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.

error: Content is protected !!