ఆగకుండా అడుగులేస్తి అయ్యప్పా నిన్ను పిలిచి
తలవకుండా ఉండనైతి తల్లిదండ్రినిడిచొస్తి //2//
నా ప్రాణమైతివి నా దైవమైతివి
నా గుండె దీపమై వెలిగించితి నీకు
మరుజన్మ లేకపోయినా
గండాలు ఎదురు అయినా
వెనకడుగు వేయనయ్య నేనేమైపోయినా
ఎంత దూరం ఎంత దూరమో నీ చెంత చేర
కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ //2//
కన్నపేగు ముడివోలే మన ఇరుముడి బంధమో
కన్న కలలన్నీ నెరవేర్చె తండ్రి వైతివో
రెప్ప చాటు కన్నీళ్లే కష్టాలను మోసేరో
తప్పులెన్ని ఉన్నయో మన్నించి చేరదీయరో
ఓర్వలేదు కలికాలం నా ఈ పయనం
ఆపలేదు పలికిన నోరారా శరణం
కాళ్లు కాలిపోయిన సీము నెత్తురొచ్చినా
సల్ల చెమటలువట్టి సొమ్మసిల్లినా
కనిపిస్తే చాలు అంటూ ఆకలిని మరిచిపోతు
అయ్యప్ప నిన్ను సూడందే కడుపు నిండదూ
ఎంత దూరం ఎంత దూరమో నీ చెంత చేర
కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ //2//
41 దినములు నీ దీక్షను పడితిరో
నా గొంతు గానాలు నీకే వినిపిస్తిరో
అన్ని వదిలి నేను నీ పూజలు చేస్తిరో
నన్ను నేనూ మరచి నీ సేవలో ఉంటిరో
భక్తితోని భజన చేస్తూ బయలుదేరితీ
శక్తినిచ్చి నన్ను నడిపించు శబరికి
నేను అలసిపోతిని నిన్ను సూడలేనని
నీ భక్తుడైన నే బాటసారిని
క్షణం ఉండలేను తండ్రి నెను తల్లడిల్లి పోతి
ఈ పాదయాత్రలో నీ దరి కాననైతిని
ఎంత దూరం ఎంత దూరమో నీ చెంత చేర
కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ //2//
కంటిమీద కునుకు వేయకుండ కుమిలిపోతిరో
ఇంటి మీద ధ్యాస విడిచి ఒంటరినై వస్తిరో
మేడమిద్దెలెన్నున్నా నాతో అవి రావురో
మూడు నాళ్ళ ముచ్చట ఈ జీవితమని తెలిసేరో
నీవు తప్ప నాకు ఇంకా గొప్ప ఎవ్వరూ
తప్పదెందుకయ్యా ఈ తిప్పలెందుకు
ఒక్కసారి చూడయా వేడుకున్న రావయా
చిరు చిరు నవ్వుల బంగారు బాలుడ
శాంత సిరుల దివ్యజ్యోతి
ఈ కలియుగాన వెలసి
నిన్ను నమ్ముకున్న భక్తులకు దర్శనమిచ్చి
ఎంత దూరం ఎంత దూరమో నీ చెంత చేర
కంటతడి ఆరనన్నదో నీ రూపు చూడ //2//
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
