ఇదేం చిత్రమో
నిన్న మొన్న లేని మరో లోకమే
చూస్తున్నా నే కొత్తగా
అలా గాలిలో నీలి మేఘంలా
ఇలా పాదమే తేలి
తూలేనే ఆకాశం పై పైనా
కుదురే మరిచి
ఎగిరెల్లే హాయిలోనా ఉన్నా
మైనా నన్నే నాకే చూపే
చెలి నీ జతగా నడిచేటి
ఈ క్షణాలే చాలే
లోకాన్నే వదిలేస్తా
ఎన్నెన్నెన్నెన్నో సంతోషాల
సంద్రాలెన్నో ఉప్పొంగాయే నా లోనా
ఎన్నెన్నెన్నెన్నో అల్లి బిల్లి చిత్రాలెన్నో
నా పై వాలే నీ వల్లే
నువ్వే నవ్వితే
అంతు లేని మైకం చెయ్యే తాకితే
గుండెల్లో ఓ వేగమే మహా ఉప్పెనై
దూకుతూ ఉంటే
నా వల్ల కాదులే
నన్నే నా లోపల
దాచాలి అనుకున్నా
ఎవరు ఎపుడు నను నీలా
మార్చలేదే జాన తెలుసా
నిన్నే నిన్నే కోరి
తనువు మనసు
ఇక చెయ్యే జారిపోయే మాయే
ఈ రోజే చూస్తున్నా
ఎన్నెన్నెన్నెన్నో సంతోషాల
సంద్రాలెన్నో ఉప్పొంగాయే నా లోనా
ఎన్నెన్నెన్నెన్నో అల్లి బిల్లి చిత్రాలెన్నో
నా పై వాలే నీ వల్లే
అందమైన నా నా
పెదవి పైన నా నా
మొగుతున్న నా నా
ప్రేమ వీణ నా నా
నేను విన్న నా నా
కళ్లలోన నా నా
చేరుతున్న నా నా
కన్నులన్నీ మాయే చేస్తున్నా
బొమ్మే గీస్తున్నా
లోలో దాస్తున్నా
కళ్ళే మూసున్నా
నిన్నే చూస్తున్నా
ఆరాధిస్తున్నా
ఎన్నెన్నెన్నెన్నో సంతోషాల
సంద్రాలెన్నో ఉప్పొంగాయే
ఈ అలజడి హాయిగుంది
ఈ ఉరవడి ఆగనందే
ఎన్నెన్నెన్నెన్నో అల్లి బిల్లి చిత్రాలెన్నో
నా పై వాలే నీ వల్లే
_________________
సినిమా పేరు: వీక్షణం (Veekshanam)
పాట పేరు: ఎన్నెన్నెన్నో (Ennennenno)
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram )
లిరిసిస్ట్: రెహమాన్ (Rehman)
సంగీత దర్శకుడు: సమర్థ్ గొల్లపూడి (Samarth Gollapudi )
హీరో: రామ్ కార్తీక్ ( Ram Karthik)
హీరోయిన్: కాశ్వీ ( Kashvi)
దర్శకుడు: మనోజ్ పల్లేటి ( Manoj Palleti)
నిర్మాత: పి.పద్మనాభ రెడ్డి (P. Padmanabha Reddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.