Home » ఎమాయే పిలగా ( Emaye Pilaga) సాంగ్ లిరిక్స్ Folk

ఎమాయే పిలగా ( Emaye Pilaga) సాంగ్ లిరిక్స్ Folk

by Lakshmi Guradasi
0 comments
Emaye Pilaga song lyrics Folk

Emaye Pilaga song lyrics Folk Mamidi Mounika, Subbi Subbadu

ఎహే ఎమాయే పిలగా ఎటయే పిలగా
ఎటెటో చేస్తున్నావ్ అంత గటెటో చూస్తున్నావ్

ఎహే ఇటన్నా రావోయ్ అటన్నా పోవోయ్
అటు ఇటు చెయ్యకు అంగడిచ్చుల్ల చెయ్యకు

ఇటన్నా రావోయ్ పిలగా లేక అటన్నా పోవోయ్ పిలగా
అయ్యో అటు ఇటు చెయ్యకు పిలగా
అంత ఎటెటో అయితుంది పిలగా ….

ఎమాయే ఎమాయే
ఎయ్ ఎమాయే పిలగా ఎటయే పిలగా
ఎటెటో చేస్తున్నావ్ అంత గటెటో చూస్తున్నావ్

ఎహే ఇటన్నా రావోయ్ అటన్నా పోవోయ్
అటు ఇటు చెయ్యకు నాకేటెటో అయితుంది ఎహే

అయ్యో సిటారు కొమ్మన ఆడకు పిలగా
సిరాకు లేతుంది అంత కిరాకు లేతుంది

ఎహే పరాకు రావొద్దు పతార పోవొద్దు
పది మంది చూస్తుండ్రు పది ముచ్చట్లు పెడుతుండ్రు

పరాయి మాటలు పక్కాకు పెట్టు
కిరాయి చేతలు విడిసన్నపెట్టు
ఖరాబు లెక్కలు చెయ్యకు పిలగా
జవాబు జల్దిన ఇయ్యువ్ రా మొనగా

ఇటన్నా ఇటన్నా
ఎయ్ ఇటన్నా రావోయ్ అటన్నా పోవోయ్
అటు ఇటు చెయ్యకు ఆ ఇంత కాటేపు చెయ్యకు
కొంత అటైతే పోకు ఇటైతే రాకు
ఎటైతే అటు గాని ఇగ ఎమన్నా గానోయి

బంతియ్య పువ్వుల్లు అడగనేబట్టే బావయ్య ఎడాని
నా గోడంతా వినబట్టే
అంగట్లో ముసలవ్వ అడుగనుబట్టే మనువడు ఎడాని
మా పిలగాడు ఎడాని….

గొంగాడి వేసుకున్న గోలోల్ల తాత
గోసలు వినబట్టే బాసలు ఆడబట్టే
తండాల కూసున్న లంబాడి అమ్మమ్మ
తండ్లాడి మరి నిన్ను పెండ్లాడుకొమ్మంది

ఉన్నోళ్లు ఉన్నోళ్లు
ఎయ్ ఉన్నోళ్లు లేనోళ్ళు ఊరంత చూస్తుండ్రు
ఉత్తగా రానోయి ఉకుకే కట్నాలు అడగాకు
ఉన్నదో లేనిదో సద్ది పెడతరే బావ ఊగిసలాడకు
మా అయ్యకు ఒక్కతి బిడ్డను

మాటల్లో కలిసి మందంత చూసి
మావోళ్ల కలువాయి telugureaders.com
మంచి మర్యాద చేస్తారు

ఎహే ఆటల్ల పాటల్ల హుషారు పిట్టను
పాటల్ల కలువాకు నన్ను బదునాము చెయ్యకు

మీ వొళ్ళు మా ఇల్లు చూడాలి పిలగా
మా వొళ్ళు మీ ఇల్లు చూడాలి పిలగా
కట్నాలు గిట్నాలు వత్తాను పిలగా
సుట్టలందర్నీ మెప్పియి పిలగా

రోజుల్లు రోజుల్లు
మంచి రోజుల్లు రావంటే మాట్లాడుకోవాలి
మాట ముచ్చట కలుపు
మా వాళ్ళను ఒప్పించుకోరా

పూలు పండ్లు కావాలి
పుస్తల తాడు చాలు
నగలు నట్రలొద్దు
నల్లటి పూసల పేరెయ్యి

కులలు మాసాలు నే కోరనోయి
తూకాలు కట్టకు లేని తపాలు వాడకు
పొలలు దున్నియి పోతలు చేపియ్యి
మాఘమాసం వస్తుంది
మంచి గడియల్లా పోవంటే

Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.

Song Credits :

సాంగ్ : ఎమాయే పిలగా ( Emaye Pilaga)
నటీనటులు: చిన్ను డీడీసీ (Chinnu ddc), శ్రేయదీప్ (Shreyadeep), కృతిక్ (Kruthik), కుషి అద్విక్ (kushi Advik), రావంత్ (Ravanth) మరియు లక్ష్మణ్ (Laxman) ,సుబ్బి సుబ్బడు (subbi subbadu)
సాహిత్యం మరియు గాయని : మామిడి మౌనిక (Mamidi Mounika)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Azmeera)
నిర్మాత: అనిల్ గౌడ్ రంగు (Anil Goud Rangu)
కొరియోగ్రఫీ దర్శకత్వం: నమృత్ (Namrith)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.