ఏమనుకొని ఏమనుకొని
ఈ మలుపులకొచ్చామో
నేనెవరని నీవెవరని
ఈ చెలిమికి నచ్చామో
మలుపులో ఎదురు పడిన పయనమా…
మరపుల ముసురుకునే సమయమా…
ఎందాకో ఎందాకో ఎందాకో ఈ నడక
అందాక అందాక వస్తూనే ఉంటా నీ వెనుక
నేనేమిటో నేనుందుకో నా తోటి చెప్పింది నీ చేరిక
నేనో సగం నువ్వో సగం అవ్వాలని అంటుంది ఈ వేడుక
ఏమనుకొని ఏమనుకొని
ఈ మలుపులకొచ్చామో
నేనెవరని నీవెవరని
ఈ చెలిమికి నచ్చామో
ఇరువురే ఒక్కరిగా…
ఒకరనిలా ముగ్గురావగా
మూసి మూసి ముంగిలిలో మురిపెములే ముగ్గులవగా
ఎదిగిన ఈ పసితనమే
మన జతకే సిరి కాలిమె
తరగని ఆ పరవశమే
మన కథకే అది బలమే
నుదుటున నీ తిలకముగా
కరుపుసిలే నలిగినదే
ఈ మన కథ సాగేను కదా
సాగేను కదా..
ఏమనుకొని ఏమనుకొని
ఈ మలుపులకొచ్చామో
నేనెవరని నీవెవరని
ఈ చెలిమికి నచ్చామో
మలుపులో ఎదురు పడిన పయనమా…
మరపుల ముసురుకునే సమయమా…
ఎందాకో ఎందాకో ఎందాకో ఈ నడక
అందాక అందాక వస్తూనే ఉంటా నీ వెనుక
నేనేమిటో నేనుందుకో నా తోటి చెప్పింది నీ చేరిక
నేనో సగం నువ్వో సగం అవ్వాలని అంటుంది ఈ వేడుక
____________________________
పాట పేరు : ఏమనుకొని (Emanukoni)
సినిమా పేరు: మట్కా (Matka)
సాహిత్యం: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
గాయకుడు & సంగీతం : జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
రచన మరియు దర్శకత్వం: కరుణ కుమార్ (Karuna Kumar)
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల (Dr Vijender Reddy Teegala) మరియు రజనీ తాళ్లూరి (Rajani Talluri)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.