ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి
ఎండి కొండ పైన వెలిసి ఏడేడు లోకాలేలే
ఏనుగు రూపము గల్లా ఏకదంతుడు సూడు
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
కుడుములన్ని మెక్కి మెక్కి ముచ్చకాలనేలేటి.. జయహో గణేశా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
బ్రహ్మ సృష్టిలో జన్మించని బ్రహ్మ స్వరూపుడు గణపయ్యా
అమ్మ చేతిలో పిండి బొమ్మగా అవతరించిన పురుషుడయ్యా
తల్లి మాట నిలుపుటకు తండ్రి నే ఎదిరించిన ధైర్యశాలి ఈ విగ్నేశ్వరుడు
తల్లి తండ్రి నియమించిన దైవమే లోకమున లేరని చాటిన వాడి ఈ సర్వేశ్వరుడు
విధేయంతో చేతులెత్తి నమస్కరించిన చాలు విజ్ఞాలన్నీ తొలగించి శుభాలనే చేసేటోడు
విద్య విధేయతలకు అధిపతి ఈ వినాయకుడు.. జయహో గణేశా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
కుడుములు ఉండలు పిండి వంటలు అయ్యా కెంతో ఇష్టమంట
మోదకాల మీద స్వామికి వన్నె తరగని మోజంట
మొదటి రాట్ల పందిరేసి పూజలు చేసిన జాము మట్టిని పందిరి చేసెనట
నీయమైన భక్తులకు అభయ హస్తముతోటి అడిగింది అలగకుండా ఇచ్చేనట
పట్టంచు పంచెకట్టి పగడాల పగ చుట్టి
పసిడి సోమ్ములు పెట్టి పసందైన రూపు తోటి
పిలవగానే కలవకొచ్చే కమనీయ రూపుదంట.. జయహో గణేశా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
పల్లె పల్లె పట్టణాలలో
గల్లీ గల్లీ ఊరు వాడలు
స్వామి నవరాత్రి సంబరాలను ఘనముగా మనము జరుపుకుందము
డప్పులు దరువులతో బ్యాండు బజాలతో
ఉట్టి కొట్టి మైమరచి చిందులేద్దాము
హోర్న్లతో బడా బడా హంగులతో
గణపయ్యాను ఊరంతా ఊరేగిత్తము
పిల్ల జల్లాలంతా వారంతా కలిసి చిట్టెలుకల వాహనుడి
జెండాలు బాపతై గంగమ్మ ఒడికి తెచ్చి
వచ్చే ఏడు వరాలతో మల్లి రమ్మంటాము.. జయహో గణేశా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
ముక్కంటి ముద్దుల తనయుడు గణపయ్యా
మొక్కొటి గణముల నాథుడు గణపయ్యా
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
