ఆ.. నా జత నీవే ప్రియా
ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి
ఆ.. నా జత నీవే ప్రియా
ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలి
ఆ.. నా జత నీవే ప్రియ
నే వెతికే కలల చెలి ఇక్కడనే నా మజిలీ
జాడను చూపినదే మరి నువు పాడిన తీయని జావళి
వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి
గుండెలలో నీ మురళి వెల్లదులే నన్నొదిలి
తెరిచే ఉంచా వాకిలి దయ చేయాలని నా జాబిలి
ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలి
ఈ.. రామ చిలక సాక్ష్యం
నీ ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం మనమింక ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం విరహాలతో వాడదు ఏ క్షణం
కల నిజమై నిలచినది మన జతనే పిలచినది
ఆమని కోకిల తియ్యగా మన ప్రేమకి దీవెనలీయగా
Song Credits:
పాట : ఎక్కడికి నీ పరుగు (Ekkadiki Nee Parugu)
చిత్రం: W/o. వి.వరప్రసాద్ (W/o. V. Varaprasad)
సంగీతం: ఎంఎం కీరవాణి (MM Keeravani)
గాయకులు : SP బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam), శ్రీలేఖ (Srilekha)
సాహిత్యం: సిరివెన్నెల (Sirivennela)
నటీనటులు : జెడి చక్రవర్తి (JD Chakravarthy), వినీత్ (Vineeth), అవని (Avani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.